SC judges appointments: సుప్రీం కోర్టు జడ్జిల నియామకంపై మీడియాలో వార్తలపై CJI ఫైర్

CJI NV Ramana about Supreme Court judges appointments: సుప్రీం కోర్టు జడ్జిల నియామకం కోసం ముగ్గురు మహిళా జడ్జిలతో కలిపి మొత్తం 9 మంది జడ్జిల పేర్లతో సీజేఐ ఎన్.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలిజీయం (Supreme Court collegium) ఓ జాబితాను సిద్ధం చేసి, కేంద్రానికి సిఫార్సు చేసినట్టుగా మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2021, 03:51 PM IST
SC judges appointments: సుప్రీం కోర్టు జడ్జిల నియామకంపై మీడియాలో వార్తలపై CJI ఫైర్

CJI NV Ramana about Supreme Court judges appointments: న్యూ ఢిల్లీ: సుప్రీం కోర్టు జడ్జిల నియామకం విషయంలో మీడియాలో వస్తున్న వార్తలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సుప్రీం కోర్టు జడ్జిల నియామకం కోసం ముగ్గురు మహిళా జడ్జిలతో కలిపి మొత్తం 9 మంది జడ్జిల పేర్లతో సీజేఐ ఎన్.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలిజీయం (Supreme Court collegium) ఓ జాబితాను సిద్ధం చేసి, కేంద్రానికి సిఫార్సు చేసినట్టుగా మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 

ఇదే విషయం గురించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ బుధవారం ఓ సభలో మాట్లాడుతూ.. '' ఎంతో ప్రాముఖ్యత కలిగిన, హుందాతో కూడిన సుప్రీం కోర్టు జడ్జిల నియామకానికి (Supreme Court judges appointments) సంబంధించిన అంశం గురించి మీడియాలో ఇలా ఉహాగానాలు రావడం అత్యంత బాధాకరం'' అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనను ఒక అత్యంత దురదృష్టకరమైన పరిణామంగా సీజేఐ ఎన్వీ రమణ అభివర్ణించారు. జస్టిస్ నవీన్ సిన్హా రిటైర్మెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీజేఐ ఎన్.వి. రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.  

Also read : Madras High Court: సీబీఐ పంజరంలో ఉన్న చిలుకే, మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

మీడియాలో వస్తున్న వార్తలను ఊహాగానాలుగా అభివర్ణిస్తూ.. ప్రస్తుతానికి జడ్జిల నియామక ప్రక్రియ కొనసాగుతుందని, పలు సమావేశాల అనంతరం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని సీజేఐ ఎన్.వి. రమణ (CJI NV Ramana) తెలిపారు. అంతకంటే ముందుగానే మీడియాలో రకరకాల ఊహాగానాలు రావడంపై సీజేఐ ఆందోళన వ్యక్తంచేశారు. మీడియా మిత్రులు జడ్జిల నియామక ప్రక్రియకు ఉన్న ప్రాముఖ్యత, హుందాతనం అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే బాగుంటుందని సీజేఐ ఎన్వీ రమణ హితవు పలికారు.

Also read : Central government: న్యాయమూర్తులకు ఆ తరహా రక్షణ సాధ్యం కాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News