China renames 15 places in Arunachal Pradesh In Its Map : చైనా మరోసారి భారత్ వ్యవహారంలో మరోసారి తప్పుగా ప్రవర్తించింది. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమంంటూ చాలా ఏళ్లుగా చైనా వాదిస్తోన్న విషయం తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) 15 ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ మేరకు తన మ్యాప్‌లో (map) పేర్లు చేంజ్ చేసింది. ఈ 15 ప్రాంతాల్లో 8 నివాస ప్రాంతాలు, 4 పర్వతాలు, 2 నదులు, ఒక పర్వత మార్గం ఉన్నాయి. చైనీస్, టిబెటన్, రోమన్ ఆల్పబెట్స్తో అధికారిక పేర్లు పెట్టినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
8 నివాసిత ప్రాంతాలకు.. స్నగ్కెజాంగ్, మనిగాంగ్, దగ్లుంగ్ జాంగ్, న్యింగ్చి, డుడింగ్, డంబా, గోలింగ్, మెజాగ్గా పేర్లు పెట్టింది చైనా. ఇక 4 పర్వతాలకు డు రి, లన్‌జుబ్ రి, వామో రి, కున్మింగ్జింగ్ ఫెంగ్ అని నామకరణం చేసింది. 2 నదులకు దులైన్, జెన్ యోగ్మో అని చైనా పేర్లు పెట్టింది. ఒక పర్వత మార్గాన్ని ‘సె లా’ అని పిలవనుందట చైనా.
అయితే చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా (China) పేర్లు పెట్టడం ఇదేమీ మొదటిసారి కాదు.. గతంలో కూడా ఇలాగే పేర్లే పెట్టింది చైనా. 2017లోనూ చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని 6 ప్రాంతాలకు (six places) చైనీస్ పేర్లు పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా దక్షిణ టిబెట్‌గా పేర్కొంటోంది. ఇక చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌ను "జన్‌గ్నాన్" అని చైనీస్ పేరుతో పిలుస్తోంది.
Also Read : Video: వ్యాక్సిన్ వద్దంటూ పాటలు పాడుతూ చిన్నపిల్లాడిలా గోల గోల.. వీడియో వైరల్
ఇక చైనా తన మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 ప్రాంతాల పేర్లను మార్చినట్లు (15 places in Arunachal Pradesh) ప్రకటించడంతో భారత విదేశాంగశాఖ స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటి నుంచో భారత్‌లో అంతర్భాగంగా ఉందని.. ఎప్పటికీ అంతర్భాగంగానే ఉంటుందంటూ భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయినా చైనా తన మ్యాప్‌లో (Chinese maps) పేర్లను మార్చినంత మాత్రాన అవి భారత్‌లో (India) అంతర్భాగం కాకుండా పోతాయా అని సీరియస్ అయ్యింది.
Also Read : Corona cases in India: ఒక్క రోజులో 16,764 కరోనా కేసులు- ఒమిక్రాన్ బాధితులు @ 1,270
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook