China handed over Arunachal missing boy to India: ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో అదృశ్యమైన అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన మిరామ్ తరోన్ (17) ఎట్టకేలకు సురక్షితంగా భారత్‌లో అడుగుపెట్టాడు. మిరామ్ తరోన్‌ను (Miram Taron) చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గురువారం (జనవరి 27) భారత్‌కు అప్పగించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని వాచా-దమై ఇంటరాక్షన్ పాయింట్ వద్ద మిరామ్ తరోన్‌ను చైనా భారత్‌కు అప్పగించినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో తొమ్మిది రోజులుగా మిరామ్ తరోన్ అదృశ్యంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది.
The Chinese PLA handed over the young boy from Arunachal Pradesh Shri Miram Taron to Indian Army at WACHA-DAMAI interaction point in Arunachal Pradesh today.
I thank our proud Indian Army for pursuing the case meticulously with PLA and safely securing our young boy back home 🇮🇳 pic.twitter.com/FyiaM4wfQk— Kiren Rijiju (@KirenRijiju) January 27, 2022
మిరామ్ తరోన్‌ను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన భారత సైన్యానికి ఈ సందర్భంగా కేంద్రమంత్రి రిజిజు (Kiren Rijiju) ధన్యవాదాలు తెలిపారు. వైద్య పరీక్షలు సహా సంబంధిత ప్రోటోకాల్‌ను పాటిస్తూ మిరామ్ తరోన్ (Miram Taron) అప్పగింత ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించారు. మిరామ్ తరోన్‌ను ప్రస్తుతం అతని స్వగ్రామం జీడోకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తరోన్ అదృశ్యమైన నాటి నుంచి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులకు అతని రాక సంతోషానివ్వనుంది.
ఈ నెల 18న మిరాన్ తరోన్ అరుణాచల్ ప్రదేశ్‌లోని (Arunachal Missinb Boy) సంగ్‌పో నది సమీపంలో అదృశ్యమయ్యాడు. నిజానికి అతన్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కిడ్నాప్ చేసినట్లు.. అతనితో పాటు అక్కడికి వెళ్లిన జానీ యయింగ్ వెల్లడించాడు. చైనా పీఎల్ఏ నుంచి తాను తప్పించుకుని పారిపోయి వచ్చినట్లు చెప్పాడు. మొదట స్థానిక అధికారులకు, ఆ తర్వాత అక్కడి ఎంపీ గావ్‌కి ఈ విషయం తెలిసింది. వెంటనే ఎంపీ గావ్ కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చైనా పీఎల్ఏతో హాట్ లైన్ కమ్యూనికేషన్ ద్వారా సంప్రదింపులు జరిపిన ఇండియన్ ఆర్మీ.. ఎట్టకేలకు మిరామ్ తరోన్‌ను సురక్షితంగా వెనక్కి రప్పించగలిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook