Video: గుండెలు పిండేసే వీడియో.. కూతురి శవాన్ని భుజాలపై 10కి.మీ మోసుకెళ్లిన తండ్రి

Chattisgarh Man carries daughters body: బాలిక మృతి చెందినట్లు వైద్యులు ఈశ్వర్ దాస్, అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఈశ్వర్ దాస్ తన కూతురి మృతదేహాన్ని భుజాలపై వేసుకుని... ఆసుపత్రి నుంచి ఇంటి దాకా నడిచి వెళ్లాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 02:44 PM IST
  • ఛత్తీస్‌గఢ్‌‌లో హృదయ విదారక ఘటన
  • కూతురి మృతదేహాన్ని భుజాలపై మోస్తూ 10కి.మీ నడిచిన తండ్రి
  • నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో
Video: గుండెలు పిండేసే వీడియో.. కూతురి శవాన్ని భుజాలపై 10కి.మీ మోసుకెళ్లిన తండ్రి

Chattisgarh Man carries daughters body: ఛత్తీస్‌గఢ్‌‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తన కూతురిని.. ఇంటి వరకు భుజాలపై మోసుకెళ్లాడో తండ్రి. దాదాపు 10కి.మీ కూతురి మృతదేహాన్ని తన భుజాలపై మోస్తూ తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో విచారణకు ఆదేశించారు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... అమ్‌డాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ అనే వ్యక్తి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన కూతురిని లఖన్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకొచ్చాడు. శుక్రవారం (మార్చి 25) తెల్లవారుజామున ఆ చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించగా.. ఆ సమయంలో బాలిక ఆక్సిజన్ లెవల్ 60కి పడిపోయింది. వైద్యులు అవసరమైన వైద్య చికిత్స అందించినప్పటికీ బాలిక ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఉదయం 7.30గం. సమయంలో బాలిక మృతి చెందింది.

బాలిక మృతి చెందినట్లు వైద్యులు ఈశ్వర్ దాస్, అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఈశ్వర్ దాస్ తన కూతురి మృతదేహాన్ని భుజాలపై వేసుకుని... ఆసుపత్రి నుంచి ఇంటి దాకా నడిచి వెళ్లాడు. దాదాపు 10కి.మీ పాటు కూతురి మృతదేహాన్ని భుజాలపై మోశాడు. దీనిపై స్పందించిన ఆసుపత్రి సిబ్బంది.. మృతదేహాన్ని తరలించేందుకు వాహనం వస్తుందని, ఉదయం 9.20గంటల వరకు వేచి ఉండాలని వారితో చెప్పామన్నారు. కానీ ఈశ్వర్ దాస్ అప్పటివరకూ వేచి చూడకుండా బాలిక మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయాడన్నారు.

ఈశ్వర్ దాస్ తన కూతురి మృతదేహాన్ని భుజాలపై మోస్తూ తీసుకెళ్లిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ జరిగిన ఘటనపై విచారణ చేపట్టాలని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్‌‌ను ఆదేశించారు. ఆ వీడియో చూసి తాను చాలా కలత చెందానని టీఎస్ సింగ్ పేర్కొన్నారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. 

కొన్నేళ్ల క్రితం ఒడిశాలో వెలుగుచూసిన ఇలాంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తి తన భార్య శవాన్ని భుజాలపై 10 కి.మీ వరకు మోసుకుంటూ తీసుకెళ్లాడు. అప్పట్లో దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పటికీ దేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: RRR Movie: 'ఆర్ఆర్ఆర్'పై అల్లు అర్జున్ రియాక్షన్... తారక్, చెర్రీ పెర్ఫామెన్స్‌పై ప్రశంసలు..

Also read: RRR OTT Streaming: ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో ఎప్పుడు, ఎందులో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News