Gold Smuggling: అరికాళ్ల కింద బంగారం.. కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి..

Gold Smuggling: బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2022, 01:05 PM IST
  • బంగారం అక్రమ రవాణా
  • చెన్నై విమానాశ్రయంలో పట్టుబడ్డ వ్యక్తి
  • అరికాళ్ల కింద బంగారాన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు
Gold Smuggling: అరికాళ్ల కింద బంగారం.. కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి..

Gold Smuggling Case: కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి దొడ్డి దారిన బంగారాన్ని తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు చేయని ప్రయత్నాలంటూ ఉండవు. కస్టమ్స్ అధికారులు అసలు తమను గుర్తించలేరని బంగారాన్ని ఎక్కడెక్కడో దాచి అక్రమంగా తరలిస్తుంటారు. కానీ చివరకు కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అడ్డంగా బుక్కవక తప్పదు. తాజాగా చెన్నై విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.

సౌదీ అరేబియా నుంచి శనివారం (మార్చి 5) ఉదయం చెన్నై చేరిన విమానంలో ఆ వ్యక్తి వచ్చాడు. కస్టమ్స్ అధికారులకు అతనిపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఎక్కడ బంగారం లభించలేదు. చివరకు అతని కాళ్లకు ఉన్న చెప్పులు విప్పించి అరికాళ్లలో గమనించగా.. అక్కడ గమ్ముతో ఏదో అతికించినట్లు కనిపించింది. వెంటనే దాన్ని తెరిచి చూడగా అందులో బంగారం బయటపడింది. 

సుమారు రూ.12 లక్షలు విలువ చేసే 240 గ్రా. బంగారాన్ని అతను అక్రమంగా తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. బంగారాన్ని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మలద్వారంలో సైతం పేస్టు రూపంలో బంగారాన్ని తీసుకొచ్చి పలువురు పట్టుబడిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో నలుగురు వ్యక్తులు ఇలాగే పట్టుబడ్డాడు. మలద్వారంలో 7.3  కిలోల బంగారాన్ని పేస్టు రూపంలో వీరు తీసుకొచ్చినట్లు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు ఇలాంటి కేటుగాళ్ల అతి తెలివికి చెక్ పెడుతున్నప్పటికీ.. తరచుగా ఈ తరహా ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. 

Also Reading : Ravindra Jadeja: సెంచరీ చేసిన జడేజా.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే?!!

RRR Tickets Booking: అభిమానులకు శుభవార్త.. మొదలైన 'ఆర్​ఆర్​ఆర్' ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News