Covishield vaccine: కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెరిగింది..గమనించండి

Covishield vaccine: కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో మార్పులకు ఆదేశించింది. కోవిషీల్డ్‌పై కేంద్ర సూచించిన ఆ మార్పులేంటి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2021, 08:47 PM IST
  • వ్యాక్సిన్ పంపిణీలో అగ్రస్థానంలో ఉన్న ఇండియా, కేంద్రం ప్రకటన
  • కోవిషీల్డ్ డోసేజ్ విషయంలో మార్పులు సూచించిన కేంద్ర ప్రభుత్వం
  • కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య అంతరాన్ని 4 నుంచి 8 వారాలకు పెంచాలన్న ప్రభుత్వం
Covishield vaccine: కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెరిగింది..గమనించండి

Covishield vaccine: కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో మార్పులకు ఆదేశించింది. కోవిషీల్డ్‌పై కేంద్ర సూచించిన ఆ మార్పులేంటి.

ఇండియాలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది. మరోవైపు రెండవ దశ వ్యాక్సినేషన్ (Vaccination) ముమ్మరంగా సాగుతోంది. ఇండియాలో భారత్ బయోటెక్ కంపెనీ(Bharat Biotech)కు చెందిన కోవ్యాగ్జిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్  వ్యాక్సిన్‌లు ఇస్తున్నారు. ఇవే వ్యాక్సిన్‌లను ఇండియా ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central government) వ్యాక్సినేషన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది వ్యాక్సిన్ పంపిణీలో ఇండియా ముందు స్థానంలో ఉందని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకూ 10 కోట్ల 50 లక్షల వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసిన ఇండియా 76 ప్రపంచదేశాలకు 6 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని ఎగుమతి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వివరించింది. ప్రస్తుతం దేశంలో రోజుకు 25 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. 3 కోట్ల 71 లక్షల మంది తొలిడోసు తీసుకోగా, 74 లక్షల మంది రెండవ డోసు కూడా తీసుకున్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ (Serum institute) నెలకు 7 కోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తుంటే..బారత్ బయోటెక్ కంపెనీ నెలకు 40 లక్షల కోవ్యాగ్జిన్(Covaxin) డోసుల్ని ఉత్పత్తి చేస్తోంది.

మరోవైపు కోవిషీల్డ్ విషయంలో మార్పుల్ని సూచించింది. ప్రస్తుతం కోవిషీల్డ్(Covishield) తొలి విడతకు, రెండవ విడతకు 4 వారాల అంతరం పాటిస్తున్నారు. ఈ అంతరాన్ని 8 వారాలకు పొడిగించాలని కేంద్రం సూచించింది. అంటే తొలిడోసు తీసుకున్న రెండు నెలల తరువాత రెండవ డోసు తీసుకోవాలన్నమాట. రెండు డోసుల మధ్య 8 వారాల గ్యాప్ ఉండాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ మార్పులు కేవలం కోవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలోనేనని..కోవ్యాగ్జిన్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని కేంద్రం స్పష్టం చేసింది.

Also read: Lockdown: ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్, ఉన్నత స్థాయి సమావేశం అనంతరం నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News