Corona Death Compensation: ప్రతి కరోనా మరణానికి రూ.50 వేల పరిహారం ఇవ్వనున్న కేంద్రం!

కరోనా కారణంగా మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి లేదా బంధువులకు 50 వేల రూపాయల కరోనా మరణ పరిహారంగా చెల్లిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీం కోర్టు కూడా దీనికి అంగీకరించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2021, 07:36 PM IST
  • కరోనా కారణంగా మరణించిన వారికి రూ.50 వేలు పరిహారం
  • కేంద్ర ప్రభుత్వ వాదనను అంగీకరించిన సుప్రీం కోర్టు
  • రాష్ట్ర విపత్తు సహాయ నిధి ద్వారా చెల్లించనున్న డబ్బు
  • మార్గదర్శకాలను తయారుచేసిన NDMA
Corona Death Compensation: ప్రతి కరోనా మరణానికి రూ.50 వేల పరిహారం ఇవ్వనున్న కేంద్రం!

Corona Death Compensation: జూన్ 30 తేదీన కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మరణించిన వారికి  పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు (Supreme Court) భారత కేంద్ర ప్రభుత్వానికి (Central Government) తెలిపింది. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ఎంత మొత్తం ఇవ్వాలో స్వతహగా నిర్ణయం తీసుకునే హక్కు లేదని జూన్ 30 తేదీన సుప్రీం కోర్టు హెచ్చరించింది. 

సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా మందలించిన తరువాత,  ప్రత్యుత్తరం దాఖలు చేస్తున్నప్పుడు, దేశంలో సంభవించిన ప్రతి కరోనా మరణానికి 50 వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని తెలిపింది. అంతేకుండా, కేటాయించిన ఈ మొత్తం డబ్బు కరోనా మరణ భాదితులకు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనగా రాష్ట్ర విపత్తు సహాయ నిధి (State Disaster Relief Fund) ద్వారా వారికి అందుతుందని ప్రత్యుత్తరంలో పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం  NDMA పరిహారానికి సంబంధించిన మార్గదర్శకాలను తయారుచేసింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3.98 లక్షల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

Also Read: Video: దేశ సాంప్రదాయానికి అవమానం.. చీర కట్టుకుందని హోటల్ కు నో ఎంట్రీ..! నెటిజన్లు ఆగ్రహం

సుప్రీం కోర్టు కఠిన వైఖరి
సుప్రీంకోర్టు (Supreme Court) ముందు వివిధ పిటిషన్లను విచారించిన ప్రభుత్వం, కరోనా కారణంగా మరణించిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరిaకి రూ .4 లక్షల పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం (Central Government) తెలిపింది. ప్రభుత్వ వాదనను విన్న సుప్రీం కోర్టు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఏకీభవించింది. కరోనా కారణంగా మరణించిన కుటుంబ సభ్యులు తప్పనిసరిగా గౌరవప్రదమైన మొత్తాన్ని పొందేలా అనువైన వ్యవస్థను రూపొందించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది

Also Read: MAA Elections 2021: మా ఎన్నికలకు రంగం సిద్ధం...రేపు ప్యానెల్ ను ప్రకటించనున్న మంచు విష్ణు!

కేంద్ర ప్రభుత్వ వాదనను అంగీకరించిన సుప్రీం కోర్టు
భూకంపం, వరదలు వంటి 12 రకాల ప్రకృతి వైపరీత్యాలు విపత్తు చట్టం (Disaster Act) పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇలాంటి విపత్తుల వలన ఎవరైనా మరణిస్తే.. విపత్తు సహాయ నిధి నుండి రూ .4 లక్షల పరిహారం ఇవ్వబడుతుంది. కానీ కరోనా మహమ్మారి (Corona Crisis) ప్రకృతి వైపరీత్యాలు విపత్తు చట్టానికి (State Disaster Relief Fund) భిన్నంగా పరిగించబడిన కారణంగా ప్రతి కుటుంబానికి రూ .4 లక్షల పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వం వాదనలను విన్న సుప్రీం కోర్టు వారితో ఏకీభవించింది. కానీ కరోనా కారణంగా మరణించిన ప్రతి కుటుంబానికి ఎంత మొత్తం చెల్లించాలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నామని... అయితే పరిహారం మాత్రం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News