Free LPG Gas Connections: రెండేళ్లలో కోటిమందికి ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్

Free LPG Gas Connections: ఓ వైపు ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. రానున్న రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు కేంద్ర ఇంధన శాఖ వెల్లడించింది.   

Last Updated : Mar 1, 2021, 10:50 AM IST
Free LPG Gas Connections: రెండేళ్లలో కోటిమందికి ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్

Free LPG Gas Connections: ఓ వైపు ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. రానున్న రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు కేంద్ర ఇంధన శాఖ వెల్లడించింది. 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ( Pm ujjwala yojana )పథకాన్ని కేంద్ర ప్రభుత్వం విస్తరించనుంది. వచ్చే రెండేళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా కోటిమందికి ఉచితంగా ఎల్బీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Minister Nirmala sitaraman) ఈ విషయాన్ని ప్రకటించగా ఇప్పుడు తాజాగా ఇంధన శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ స్పష్టం చేశారు. వంటగదిలో మహిళలు కాలుష్యం బారిన పడకుండా ఉండే ఉద్దేశ్యంతో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకంలో భాగంగా ఈ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.  2021-22 బడ్జెట్‌లో ఈ పథకం ప్రస్తావన ఉంది గానీ..కేటాయింపులు మాత్రం జరగలేదు. దాంతో ఉచిత కనెక్షన్లు ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తింది.

ఈ నేపధ్యంలో కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ వివరణ ఇచ్చారు. ఒక్కో కనెక్షన్‌కు అయ్యే 16 వందల రూపాయల ఖర్చును సబ్సిడీ ద్వారా పూడ్చుకోవచ్చని..బడ్జెట్ కేటాయింపు లేకపోయినా ఫరవాలేదని చెప్పారు. కనెక్షన్లు ఇచ్చేందుకు ఉన్న నిబంధనల్ని సులభతరం చేసినట్టు చెప్పారు. గ్యాస్ అయిపోతే సమీపంలోని డీలర్‌ను సంప్రదించి ఫిల్ చేసుకునేలా ఒప్పందాలు జరిగినట్టు చెప్పారు. గత నాలుగేళ్లలో 8 కోట్ల ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని...రానున్న రెండేళ్లలో మరో కోటి ఉచిత కనెక్షన్లు ( Free lpg gas connections) ఇస్తామని చెప్పారు. తరచూ ఊర్లు మారేవారికి సైతం ఎల్పీజీ కనెక్షన్లు లభించేలా నిబంధనలు సరళతరం చేయాల్సిందిగా ఆయిల్ కంపెనీల్ని కోరింది ఇంధన శాఖ. 

Also read: COVID-19 Vaccine తొలి డోసు తీసుకున్న ప్రధాని Narendra Modi, అనంతరం ఏమన్నారంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News