Re registration Charges: రీ రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత, ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లో

Re registration Charges: పాత వాహనాలపై కేంద్ర ప్రభుత్వం మోత మోగిస్తోంది. రీ రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని భారీగా పెంచేసింది. పెంచిన కొత్త ధరల్ని కేంద్రమంత్రి ఆమోదం తెలపడంతో..ఏప్రిల్ 1 నుంచి అమల్లో రానున్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 15, 2022, 12:51 PM IST
  • పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపు
  • పెంపు ప్రతిపాదనకు కేంద్రమంత్రి గడ్కరీ ఆమోదం
  • ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త ధరలు
Re registration Charges: రీ రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత, ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లో

Re registration Charges: పాత వాహనాలపై కేంద్ర ప్రభుత్వం మోత మోగిస్తోంది. రీ రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని భారీగా పెంచేసింది. పెంచిన కొత్త ధరల్ని కేంద్రమంత్రి ఆమోదం తెలపడంతో..ఏప్రిల్ 1 నుంచి అమల్లో రానున్నాయి. 

పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను మోదీ ప్రభుత్వం భారీగా పెంచింది. 15 ఏళ్లు దాటిన వాహనాలపై ఛార్జీలను సుమారు 8 రెట్లు పెంచారు. ఇందులో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలపై హరిత పన్ను విధిస్తూ ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. దీనికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. 

ఈ నిబంధన ప్రకారం 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఐదేళ్ల కోసారి రెన్యువల్ చేయించుకోవాలి. వీటితోపాటు ఎనిమిదేళ్ల దాటిన తర్వాత తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. వ్యక్తిగత వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌ ఆలస్యమైతే నెలకు 300 రూపాయల చొప్పున, వాణిజ్య వాహనాలైతే 500 చొప్పున అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఐతే ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతాన్ని ఈ ఉత్తర్వుల నుంచి మినహాయించారు. రాజధానిలో 15 ఏళ్లు దాటిన పెట్రోల్, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాల రీ-రిజిస్ట్రేషన్లను కేంద్రం ఇప్పటికే రద్దు చేసింది. పాత వాహనాలను నడపాలంటే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవాలని స్పష్టం చేసింది. 

Also read: AAP Target Bengal: మొన్న ఢిల్లీ, నేడు పంజాబ్, రేపు బెంగాల్..ఆప్ టార్గెట్ అదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News