CCMB Warning: కరోనా వేవ్‌లు వస్తూనే ఉంటాయి..తస్మాత్ జాగ్రత్త

కరోనా వైరస్ వ్యవహారంలో ఆందోళన కల్గించే వార్తలు వెలువడుతున్నాయి. ప్రఖ్యాత సీసీఎంబీ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండకపోతే మరో లాక్ డౌన్ తప్పదని హెచ్చరించింది.

Last Updated : Nov 6, 2020, 04:23 PM IST
CCMB Warning: కరోనా వేవ్‌లు వస్తూనే ఉంటాయి..తస్మాత్ జాగ్రత్త

కరోనా వైరస్ ( Corona virus ) వ్యవహారంలో ఆందోళన కల్గించే వార్తలు వెలువడుతున్నాయి. ప్రఖ్యాత సీసీఎంబీ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండకపోతే మరో లాక్‌డౌన్ తప్పదని హెచ్చరించింది.

కరోనా వైరస్ ప్రమాదం ఇంకా తొలగలేదు. అన్‌లాక్ ప్రక్రియ ( Unlock process ) ప్రారంభమైనప్పటి నుంచి చాలా ప్రాంతాల్లో అప్రమత్తత కన్పించడం లేదు. కరోనా వైరస్‌ను ప్రజలు తేలిగ్గా తీసుకుంటున్నారు. మరోవైపు శీతాకాలం నేపధ్యంలో వైరస్ మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిన కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. 

ముఖ్యంగా ఢిల్లీ ( Delhi ) లో కరోనా థర్డ్‌వేవ్ ( Corona Third wave ) ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Cm Arvind kejriwal ) స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన  సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ ( CCMB ) సంస్థ సంచలనం ప్రకటన చేసింది. కరోనా వైరస్ విషయంలో భవిష్యత్‌లో చాలా అప్రమత్తంగా ఉండాలని  సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరించారు. లేకపోతే మరో లాక్‌డౌన్ ( Lockdown ) తప్పదన్నారు. చాలా ప్రాంతాల్లో మానవ తప్పిదాల వల్ల వైరస్ విజృంభిస్తోందన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ( Corona second wave ) నడుస్తోందన్నారు. ఇది చాలా ప్రమాదకరమని చెప్పారు. 

కరోనా వైరస్ ఇంకా తొలగిపోలేదని..మన చుట్టూనే ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని..పండుగలు, పెళ్లిళ్లలో జాగ్రత్తగా ఉండాలన్నారు. 60-70 శాతం యాంటీబాడీలుండే హార్డ్ ఇమ్యూనిటీ లేదా వ్యాక్సిన్ వచ్చేంతవరకూ  కరోనా వైరస్ వేవ్‌లు ( Corona waves ) వస్తూనే ఉంటాయన్నారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందాలంటే మరో రెండేళ్లు పడుతుందని తెలిపారు. మాస్క్, శానిటైజేషన్, సామాజిక దూరంతోనే కరోనాను జయించాలని సీసీఎంబీ డైరెక్టర్ సూచించారు. Also read: Tamilnadu: డీఎంకేతో పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేసిన కమల్ హాసన్

Trending News