యూజీసీ-నెట్ ఫలితాలు విడుదల

యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి.

Last Updated : Aug 1, 2018, 10:46 AM IST
యూజీసీ-నెట్ ఫలితాలు విడుదల

యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం (జులై 31) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 55,872 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుతోపాటు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు 3,929 మంది అర్హత సాధించారని సీబీఎస్ఈ పేర్కొంది. ఏడాది అత్యధికంగా అర్హత సాధించారు. క్రితం ఏడాది నిర్వహించిన నెట్‌ లో సుమారు 38 వేల మంది అర్హత సాధించారు.

పరీక్ష రాసిన మూడు వారాల్లోనే సీబీఎస్ఈ ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా  జూలై 8న యూజీసీ–నీట్ టెస్టును నిర్వహించారు. పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 11,48,235 మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోగా అందులో 8,59,498 మంది పరీక్ష రాశారు. ఈసారి పరీక్షల విధానంలో మార్పులు తెచ్చారు. మొదటిసారి  మూడు పేపర్ల విధానాన్ని వదిలేసి రెండు పేపర్లలో(జనరల్, సబ్జెక్టు పేపర్)పరీక్ష నిర్వహించారు.  84 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. ఫలితాలను cbsenet.nic.in అనే వెబ్‌సైట్‌కు వెళ్ళి చూసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Trending News