CBSE Class 12 Board Exam 2021: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై మంత్రి ప్రకటన ?

CBSE Class 12 Board Exam 2021: న్యూ ఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై ఈ ఆదివారం స్పష్టత రానుందా అంటే అవుననే తెలుస్తోంది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా ? లేదా ? ఒకవేళ నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహిస్తారు ? ఏ పద్దతిలో నిర్వహిస్తారు ? ఇలా గత కొద్ది రోజులుగా విద్యార్థులు (CBSE Class XII students), వారి తల్లిదండ్రులను అనేక సందేహాలు వేధిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2021, 03:28 AM IST
CBSE Class 12 Board Exam 2021: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై మంత్రి ప్రకటన ?

CBSE Class 12 Board Exam 2021: న్యూ ఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై ఈ ఆదివారం స్పష్టత రానుందా అంటే అవుననే తెలుస్తోంది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా ? లేదా ? ఒకవేళ నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహిస్తారు ? ఏ పద్దతిలో నిర్వహిస్తారు ? ఇలా గత కొద్ది రోజులుగా విద్యార్థులు (CBSE Class XII students), వారి తల్లిదండ్రులను అనేక సందేహాలు వేధిస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానం రానుందని సమాచారం. అందులో భాగంగానే కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంఖ్ (Ramesh Nishank Pokhriyal) ఈ ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఓ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 12వ తరగతి పరీక్షల నిర్వహణకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో సావధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్రం నుంచి ఓ స్పష్టమైన ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపించే ఈ నిర్ణయం అయినా వెనుకా ముందు ఎంతో ఆలోచించి, అన్నివర్గాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటారని.. అలాగే ఈ నిర్ణయం కూడా అంతేనని కేంద్ర మంత్రి నిశాంక్ తెలిపారు. అందుకోసం స్టూడెంట్స్ (CBSE XII class exams), పేరెంట్స్ వారి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రి నిశాంక్ విజ్ఞప్తి చేశారు.

Also read : Covid-19 vaccination: 18-44 వయస్సు వారికి వ్యాక్సిన్ నిలిపివేత

రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో వర్చువల్ పద్ధతిలో 11.30 గంటలకు జరగనున్న ఈ ఉన్నత స్థాయి సమావేశానికి రమేశ్ పోక్రియాల్ నిశాంక్‌తో (Ramesh Pokhriyal Nishank)  పాటు మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, మాజీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరాని కూడా పాల్గొననున్నారు.

Also read : Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News