Buying TV, fridge, AC : టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ కొంటున్నారా ? అయితే ఇది చదవండి !

వేసవి వచ్చేస్తోంది కనుక మీరు ఫ్రిడ్జ్, ఏసి లాంటివి ఏమైనా కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే, మీరు త్వరపడాల్సిందేనేమో... లేదంటే వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ధరలు పెరిగే గృహోపకరణాల్లో ఏసి, ఫ్రిడ్జ్‌, టీవీతో పాటు ఇతర విద్యుత్ ఉపకరణాలు కూడా ఉన్నాయి.

Last Updated : Feb 28, 2020, 02:49 PM IST
Buying TV, fridge, AC : టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ కొంటున్నారా ? అయితే ఇది చదవండి !

వేసవి వచ్చేస్తోంది కనుక మీరు ఫ్రిడ్జ్, ఏసి లాంటివి ఏమైనా కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే, మీరు త్వరపడాల్సిందేనేమో... లేదంటే వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ధరలు పెరిగే గృహోపకరణాల్లో ఏసి, ఫ్రిడ్జ్‌, టీవీతో పాటు ఇతర విద్యుత్ ఉపకరణాలు కూడా ఉన్నాయి. రానున్నది వేసవి సీజన్ కదా.. అందుకే ధరలు పెరుగుతున్నాయేమో అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఈసారి ధరల పెరుగులదలపై వేసవి సీజన్‌తో పాటు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ ప్రభావం కూడా పడింది. అవును, ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం ఇప్పటికే బంగారం, పెట్రోల్, డీజిల్ లాంటివాటిపై పడిన సంగతి తెలిసిందే. కరోనావైరస్ ప్రభావంతో బంగారం ధరలు పెరగ్గా.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఐదు నెలల కనిష్టానికి పడిపోయాయి. అయితే కరోనావైరస్ కారణంగా ఇంధనం ధరలు తగ్గినప్పటికీ.. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ లాంటి వాటి ధరలు మాత్రం బంగారం లాగే 7-15% పెరగనున్నాయి అంటున్నాయి మార్కెట్ వర్గాలు. Read also : భారీగా సర్వీస్ ఛార్జిలను పెంచి ఆ కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎస్బీఐ

భారత్‌లో ఏసి, ఫ్రిడ్జ్, టీవీల అమ్మకాల్లో చైనా వాటా అధికంగానే ఉండగా... తాజాగా చైనాలో కరోనా వైరస్ కారణంగా చైనా నుంచి భారత్‌కి వచ్చే సప్లై చైన్‌పై ప్రభావం పడింది. ఈ కారణంగానే రానున్న రెండు, మూడు నెలల్లో టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు 7 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Related article : SBI Bank Holidays in March: మార్చిలో వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్!

ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ల తయారీకి పనికొచ్చే కంట్రోలర్లు, కంప్రెషర్స్ వంటి విడిభాగాలు ఎక్కువగా చైనా నుంచి దిగుమతి కానుండటంతో ఈ ఎండా కాలం మార్కెట్‌కి కరోనా వైరస్ పెను సవాల్ విసరనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా... ఆగిపోయిన సప్లైని వీలైనంత త్వరగా పునరుద్దరించేందుకు భారత్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News