Burevi cyclone live updates: నివర్ సైక్లోన్ ప్రభావం ముగిసింది. ఇప్పుడు మరో బురేవి తుపాను భయం వెంటాడుతోంది. మరో రెండ్రోజుల్లో తమిళనాడులో తీరం దాటనున్న తుపాను ప్రభావంతో..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
నివర్ సైక్లోన్ ( Nivar cyclone ) తీరం దాటిన పదిరోజులకు మరో సైక్లోన్ తీరం దాటనుంది. బంగాళాఖాతం ( Bay of Bengal )లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి..తుపాను రూపం దాలుస్తోంది. దక్షిణ తీరాన బీభత్సం సృష్టించేందుకు దూసుకొస్తోంది. బురేవి తుపాను ( Burevi cyclone ) భయంతో దక్షిణ తమిళనాడు, కేరళ తీర ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ ప్రాంతాలకు వాతావరణ శాఖ ( IMD ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ప్రస్తుతం బురేవి తుఫాన్ శ్రీలంక త్రీణి కోమలికి తూర్పు ఆగ్నేయ దిశగా 300 కిలోమీటర్ల దూరంలో.. పంబన్‌కు 530 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక కన్యాకుమారికి తూర్పున 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న బురేవి గంటకు...12 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. రానున్న ఆరేడు గంటల్లో ఇది మరింతగా బలపడి..తీవ్ర తుపానుగా మారనుంది. డిసెంబర్ 4 వ తేదీన కన్యాకుమారి ( Kanyakumari ), పంబన్ ( pamban )ల మధ్య తీరం దాటవచ్చని తెలుస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
ఇక బురేవి తుపాను ( Burevi cyclone ) ప్రభావంతో ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు తమిళనాడు ( Tamilnadu )లోని కన్యాకుమారి, తిరునల్వేలి, తుత్తుకూడి, తెన్ కాశి, రామనాథపురం, శివగంగై జిల్లాల్లోనూ..కేరళ ( Kerala )లోని తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుళ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక బురేవీ తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీ ( AP ) లోని దక్షిణ కోస్తాతో పాటు పుదుచ్చేరిలో భారీ వర్షాలు ( Heavy rains ) పడనున్నాయి. ఇప్పటికే నివర్ సైక్లోన్ కారణంగా ఏర్పడిన నష్టం నుంచి తేరుకోకముందే..మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని తెలియడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. Also read: Farmer protests: కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి కేంద్రంతో భేటీ