BSNL Cabinet Meet: బీఎస్‌ఎన్‌ఎల్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. పునరుద్ధరణకు భారీ ప్యాకేజీ!

Cabinet approves Rs 1.64 lakh crores revival package for BSNL. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 27, 2022, 08:04 PM IST
  • బీఎస్‌ఎన్‌ఎల్‌పై కేంద్రం కీలక నిర్ణయం
  • పునరుద్ధరణకు భారీ ప్యాకేజీ
  • బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యతను మెరుగు
BSNL Cabinet Meet: బీఎస్‌ఎన్‌ఎల్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. పునరుద్ధరణకు భారీ ప్యాకేజీ!

Cabinet approves Rs 1.64 lakh crores revival package for BSNL: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్‌ పునరుద్ధరణకు రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. మెరుగైన సేవలు, స్పెక్ట్రమ్‌ కేటాయింపు, బ్యాలెన్స్‌ షీట్‌పై ఒత్తిడి తగ్గించడం, ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో భాగంగా భారత్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీబీఎన్ఎల్)ను బీఎస్‌ఎన్‌ఎల్‌తో విలీనం వంటివి పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉన్నాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. బలమైన ప్రభుత్వ రంగ సంస్థ అవసరమని ఆయన పేర్కొన్నారు. 

ఈ విలీనంతో బీఎస్‌ఎన్ఎల్ దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయతీల్లో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఉపయోగించి.. 5.67 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్‌ను పొందనుంది. ఈరోజు కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్.. ఈ  ప్యాకేజీలో మూడు ప్రధాన అంశాలు ఉంటాయని చెప్పారు. ఈ ప్యాకేజీ బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యతను మెరుగుపరుస్తుందని,  ఖర్చులను తగ్గించడానికి ఉపయోగపడుతుందన్నారు. 

మొత్తం ప్యాకేజీలో రూ. 43,964 కోట్లు నగదు రూపంలో.. మిగిలిన రూ.1.2 లక్షల కోట్లు నాలుగు సంవత్సరాల కాలానికి నగదు రహితంగా ఇస్తామని టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. 4జీ సేవల విస్తరణ కోసం 900/1800 MHz స్పెక్ట్రమ్‌ను కేటాయించనున్నారని,  ఇందుకోసం రూ. 44,993 కోట్లను ఈక్విటీలుగా మార్చనున్నట్లు చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్యాలెన్‌ షీట్‌లో రూ. 33,404 కోట్లుగా ఉన్న బకాయిలను కూడా ఈక్విటీలుగా మార్చనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. 1,20,000 సైట్లలో 4జీ సేవలు అవసరమని, ప్రతి నెలా కొత్తగా లక్ష కనెక్షన్లు ఇస్తామన్నారు.

Also Read: ఏడాదిలోనే బ్రేకప్‌ చెప్పేసిన హీరోయిన్.. మూన్నాళ్ల ముచ్చటే అయిందిగా!

Also Read: Minister KTR: తెలంగాణకు మరోమారు భారీ వర్ష సూచన..అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి కేటీఆర్..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x