Breaking News: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా.. ఇంట్లోనే ఐసొలేషన్‌!!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ఢిల్లీ సీఎం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 01:31 PM IST
  • అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా
  • ఇంట్లోనే ఐసొలేషన్‌ అయిన ఢిల్లీ సీఎం
  • ఢిల్లీలో భారీ స్థాయిలో క‌రోనా కేసులు
Breaking News: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా.. ఇంట్లోనే ఐసొలేషన్‌!!

Delhi CM Arvind Kejriwal Test positive for Covid 19: దేశరాజధాబి ఢిల్లీ (Delhi)లో రోజు రోజుకు క‌రోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటుగా ప్రముఖులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌ (Arvind Kejriwal Corona Positive)గా నిర్ధారణ అయింది.

ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ఢిల్లీ సీఎం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే సీఎంకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయట. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఐసొలేషన్‌లోనే ఉన్నారు. 

'నాకు కోవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లోనే నేను ఐసొలేషన్‌లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కాంటాక్ట్ అయిన వారు ఒంటరిగా ఉండండి. అందరూ టెస్టులు చేయించుకోండి' అని ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు.

సీఎంకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండడంతో ఆయనకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఓ వైద్య బృందం సీఎం ఇంటివద్ద ఉందట. విషయం తెలిసిన పార్టీ నేతలు, ప్రజలు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

Also Read: IND vs SA: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. గాయపడిన స్టార్ పేసర్! బరిలోకి దిగడం కష్టమే?

ఢిల్లీలో రోజు రోజుకు క‌రోనా మహమ్మారి (Covid 19) కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండ‌టంతో ఇప్ప‌టికే అక్కడ నైట్ క‌ర్ఫ్యూ విధించారు. అంతేకాదు విద్యా సంస్థ‌లు, పార్కులు, సినిమా థియేట‌ర్లు, జిమ్‌, స్పాలు మూసివేశారు.

ఇక 50 శాతం సీటింగ్‌తో రెస్టారెంట్, మెట్రోలు మాత్రం కొన‌సాగుతున్నాయి. మరోవైపు కార్యాల‌యాలు 50 శాతం సిబ్బందితో న‌డుస్తున్నాయి. జ‌న‌వ‌రి 3వ తేదీన ఢిల్లీలో 4099 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 6.46శాతంగా ఉంది.  

Also Read: Today's Horoscope: 4-1-2022 మంగళవారం.. ఆ రాశి వారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News