రైలు ప్రయాణం చేసే వారికి శుభవార్త. రైలు టికెట్లను బుక్ చేసుకునేవారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు అధికారిక వెబ్‌సైట్ www.irctc.co.in ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి వర్తిస్తుందని తెలిపింది. ఐఆర్‌సీటీసీ ద్వారా పేటీఎం, మొబిక్విక్ వంటి డిజిటల్ వ్యాలెట్లతో రైల్వే టికెట్‌ను బుక్ చేసుకునే వారికే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.
మొబిక్విక్ ద్వారా రైల్వే టిక్కెట్ బుకింగ్ జరిపే వారికి 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. పేటీఎం ద్వారా టిక్కెట్ బుకింగ్స్ జరిపే వారికి 100 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే ద్వారా చెల్లింపులు జరిపితే 100 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. దీనితోపాటు మొదటి రెండు ట్రాన్సాక్షన్లకు రూ.50 రాయితీ ఇవ్వనుంది. పండుగ సీజన్‌ను దృష్టిలో.. చివరి నిమిషంలో టిక్కెట్ల కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఐఆర్‌సీటీసీ ఈ డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది.
డిస్కౌంట్ పొందడం ఎలా?
ఆఫర్ల సీజన్: రైలు ప్రయాణం చేసే వారికి శుభవార్త