Bombay Highcourt Sensational Orders Wife To Pay Alomony To Husband: సమాజంలో భార్యభర్తల బంధానికి ఒక ఉన్నతమైన స్ఠానం ఉంది. కానీ కొందరు తమ పనుల వల్ల సమాజంలో వివాహ బంధాన్ని నీరుగారుస్తున్నారు. ఒకప్పుడు సమాజంలో పెళ్లిళ్లను పెద్దలు కుదిర్చేవారు. ఆ తర్వాత ఏవైన కొద్దిపాటి అభిప్రాయ బేధాలు వస్తే, మాట్లాడుకుని పరిష్కరించుకుంటారు. కానీ మరికొందరు మాత్రం.. ప్రతిదానికి గొడవలు పడి సమాజంలో తమపరువును, తమవాళ్లపరువును తీసుకునేలా చేస్తుంటారు. కొందరు పెళ్లి తర్వాత ఎఫైర్ లు పెట్టుకుంటారు.నేటి యువత దీనికి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. యువత ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా.. పెళ్లికాకుండానే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో కూడా ఉంటున్నారు.
కొందరు యువత ఇంట్లో వాళ్లకు తెలియనీయకుండా తమకునచ్చిన వారితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. ఇలా కొన్నేళ్లపాటు కలిసి జర్నీ చేస్తున్నారు. ఆ తర్వాత తమ అభిరుచులు, ఆలోచనలు కలిస్తే ముందుకు వెళ్తున్నారు. లేకుంటే మధ్యలోనే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు.పెళ్లి తర్వాత కొందరు భార్యభర్తల మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడతాయి. ఇద్దరు పెరిగిన వాతావరణం, పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీంతో ఆలోనల్లో విభేదాలు ఉంటాయి. కొందరు వీటిని నాలుగు గొడల మధ్య సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.
మరికొందరు అందరి మధ్యపంచాయతీలు పెట్టుకుని,కోర్టులకు కూడా వెళ్లడానికి వెనుకాడవరు. కొన్ని చోట్ల మహిళలు, భర్తలను వేధిస్తుంటారు. మరికొన్ని చోట్లలో.. మగాళ్లు కూడా తమ భార్యలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు.దీంతో ఇలాంటి ఘటనలు కోర్టులవరకు వెళ్తుంటాయి. పెళ్లైన మహిళతనకు భర్త శాలరీ నుంచి ప్రతినెల కొంత భరణం రూపంలో ఇవ్వాలని కూడా కోర్టులో పిటిషలు వేస్తుంటారు. కానీ ఈ కేసులో మాత్రం వెరైటీగా ఒక భర్త తన భార్య నుంచి భరణం వచ్చేలా చూడాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
పూర్తి వివరాలు..
ముంబైలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ముంబైకు చెందిన దంపతులు కొద్దిరోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో సదరు భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతని భార్య బ్యాంక్ లో మెనెజర్ గా పనిచేస్తుంది. ఇదిలా ఉండగా.. సదరు వ్యక్తి తన ఆర్యోగ్యం బాగాలేదని, ఉద్యోగం చేసే పరిస్థితిలో లేనని చెప్పారు. అంతేకాకుండా.. తన భార్య బ్యాంక్ లో జాబ్ చేస్తుంది. అందుకే ప్రతినెల తనకు పదివేల రూపాయలు భరణం ఇచ్చేలా ఆర్డర్ ఇవ్వాలని కూడా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
Read More: Snake Swallows Itself: బాప్ రే.. తన తోకను తానే మింగేస్తున్న పాము.. వైరల్ గా మారిన వీడియో..
ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టు సదరు మహిళకు పదివేలు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆమె తాజాగా, ఆమె ముంబైలోని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం సదరువ్యక్తి.. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడని, అతనకి పదివేలు ఇవ్వాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా.. సదరు మహిళ పిటిషన్ ను మాత్రం కొట్టేసింది. ఈ క్రమంలో హైకోర్టు భర్తకు భరణం చెల్పించాలన్న హైకోర్టు తీర్పు ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter