మమతా బెనర్జి బయోపిక్‌పై ఇసికి బీజేపి ఫిర్యాదు

మమతా బెనర్జి బయోపిక్‌పై ఇసికి బీజేపి ఫిర్యాదు

Last Updated : Apr 17, 2019, 07:07 PM IST
మమతా బెనర్జి బయోపిక్‌పై ఇసికి బీజేపి ఫిర్యాదు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జి జీవితచరిత్ర ఆధారంగా రూపొందిన సినిమాగా ప్రచారం అందుకుంటున్న భాగిని చిత్రాన్ని విడుదలకన్నా ముందుగా వీక్షించి సమీక్ష జరపాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపి కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి, పశ్చిమ బెంగాల్‌లోని ఎన్నికల ప్రధాన అధికారికి ఓ లేఖ రాసిన భారతీయ జనతా పార్టీ.. ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ని ఎలాగైతే పరిశీలించారో అదే తరహాలో భాగిని చిత్రాన్ని సైతం రివ్యూ చేయాల్సిందిగా తమ లేఖలో విజ్ఞప్తి చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ సినిమా విడుదలను ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వాయిదా వేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భాగిని చిత్రానికి సైతం ఎన్నికల కోడ్ నిబంధన వర్తిస్తుందనే ఉద్దేశంతోనే పశ్చిమ బెంగాల్‌లోని భారతీయ జనతా పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.

Trending News