GVL on Polavaram: ఎవరు ఔనన్నా కాదన్నా పోలవరం పూర్తి తధ్యం..జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..!

GVL on Polavaram: తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరంపై రగడ కొనసాగుతోంది. గోదావరి వరదల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 21, 2022, 09:53 AM IST
  • పోలవరంపై రగడ
  • ఇరురాష్ట్రాల మధ్య మాటల యుద్ధం
  • తాజాగా జీవీఎల్ క్లారిటీ
GVL on Polavaram: ఎవరు ఔనన్నా కాదన్నా పోలవరం పూర్తి తధ్యం..జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..!

GVL on Polavaram: పోలవరం ప్రాజెక్ట్‌పై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. పోలవరం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం ఒప్పుకుందన్నారు. ఇప్పుడు వారు ఒప్పుకోవాల్సిన అవసరం లేదని..గతంలో అంగీకరించినట్లు కేంద్ర చట్టంలో ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

పోలవరం ఎత్తు పెంపుతో భద్రాచలానికి ముంపు వస్తుందనే తెలంగాణ మంత్రుల అభిప్రాయాన్ని రాజకీయంగానే చూస్తామన్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా పోలవరం నిర్మాణం తధ్యమని జీవీఎల్ తేల్చి చెప్పారు. వరదల నష్టాల అంశాన్ని పార్లమెంట్‌ దృష్టికి తీసుకొస్తామని..దీనిపై కేంద్రమంత్రులు స్పందిస్తారని తెలిపారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ వంటి పార్టీలు ఏదో ఒక్క కారణంతో పార్లమెంట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యేక హోదాపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ఆధిపత్యం వల్లే ఈ అంశం తెరపైకి వస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు సాధ్యం కాదో 2015లోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అప్పటి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారని..మళ్లీ ఎప్పుడు అడగడం ఏంటన్నారు.

Also read:Video: రెప్ప పాటులో మృత్యువు నుంచి బయటపడ్డాడు.. ఈ వీడియో చూస్తే ఉలిక్కిపడటం ఖాయం  

Also read:Telangana Rains Update: తెలంగాణలో మళ్లీ వర్షాలు... ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News