'బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది' : రాహుల్ గాంధీ

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు.

Last Updated : May 17, 2018, 11:23 AM IST
'బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది' : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని అన్నారు.
 
సంఖ్యా బలం లేకపోయినా బీజేపీ అహంకారపూరితంగా పట్టుబట్టి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ఆయన అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించిందని రాహుల్ ఆరోపించారు. అటు ఈ రోజు ఉదయం
యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

 

Trending News