BJP JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు గా నడ్డా ఔట్.. కొత్త ప్రెసిడెంట్ అతనేనా.. ?

BJP JP Nadda: తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అబ్ కీ బార్ 400 పార్ అన్న బీజేపీ నినాదం వర్కౌట్ కాలేదు. మొత్తంగా ఎన్టీయే కూటమి 300 లోపు సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి జవసత్వాలు ఇవ్వడానికి పార్టీ అధ్యక్ష మార్పు ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 7, 2024, 05:40 AM IST
BJP JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు గా నడ్డా ఔట్.. కొత్త ప్రెసిడెంట్ అతనేనా.. ?

BJP National President JP Nadda: వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. మూడోసారి ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని మెజారిటీకి తక్కువ దూరంలో ఆగిపోయింది. 400 అనుకున్న లక్ష్యం సాధించకపోవడంతో ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చేందుకు రంగం సిద్దం అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నడ్డా పదవీ కాలం పూర్తైయింది. సార్వత్రిక ఎన్నికల వరకు ఆయన్నిఆ పదవిలో  కొనసాగించారు. త్వరలో మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  కు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లో బీజేపి అప్రతహత విజయాలు నమోదు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాదు మధ్య ప్రదేశ్ ను ఎక్కువ రోజులు పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డులు నమోద చేసారు. గత ఎన్నికల్లో మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో ఆయన పేరు మీదుగా జరిగాయి. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చౌహాన్ ను పక్కన పెట్టి బీసీ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిని చేసారు.

అంతేకాదు తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మధ్య ప్రదేశ్ లో 29 సీట్లకు 29 సీట్లను గెలిపించుకోగలిగారు. అంతేకాదు ఆయన మధ్య ప్రదేశ్ లోని విదిశా నుంచి దాదాపు 8,21, 408 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటికే ఢిల్లికి రమ్మని ఆయనకు ఆహ్వానం అందింది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ కు కూడా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్టు ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Also Read: KT Rama Rao: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశే.. కానీ ఫినీక్స్‌ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News