Revanth Prediction: మూడోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరదని రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి రెండంకెల సీట్లు కూడా రావని జోష్యం చెప్పారు. దక్షిణాదిన ఇండియా కూటమి క్లీన్‌స్వీప్ చేస్తుందని ప్రకటించారు. మోదీ కల నెరవేరదని.. భారీ షాక్ తప్పదని పేర్కొన్నారు.
Also Read: Cash For Vote: రేవంత్ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కు
కేరళలో ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతోపాటు దక్షిణ భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న 130 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 15లోపు స్థానాలు కూడా పొదడం కష్టమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 115 నుంచి 120 స్థానాలు గెలుపొందుతుందని ప్రకటించారు. మోదీపై చేస్తున్న పోరాటానికి దక్షిణ భారతదేశం గొప్ప ఊపు ఇస్తుందని పేర్కొన్నారు.
Also Read: Nakrekal: కేసీఆర్, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటా
కేరళలో బీజేపీ దయనీయ పరిస్థితిని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటివరకు బీజేపీ కేరళలో అడుగుపెట్టలేదని.. ఒక్క స్థానం కూడా గెలవలేదని చెప్పారు. మలయాళ గడ్డపై ఇండియా కూటమి 20 లోక్‌సభ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి బీజేపీ డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ఇక తెలంగాణ ఎన్నికలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. '17 స్థానాల్లో 14 ఎంపీలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది' అని చెప్పారు.
దక్షిణాదిపై మోదీ దృష్టి
మూడోసారి అధికారంలోకి 400 సీట్లతో వస్తామని బీజేపీ ధీమాగా చెబుతోంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే దక్షిణ భారతదేశం ద్వారా సాధ్యమని భావిస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై పూర్తి దృష్టి సారించింది. ఏపీలో ఏ పార్టీ గెలిచినా ఎన్డీయే కోటాలోనే సీట్లు చేరుతాయి. ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కర్ణాటకలో ఆ పార్టీ బలంగానే ఉంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఎంపీ సీట్లు గెలువాలనే పట్టుదలగా ఉన్న నరేంద్ర మోదీ ఆ రాష్ట్రాల్లో తరచూ పర్యటిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న 130 స్థానాల్లో కనీసం 40 నుంచి 50 స్థానాలు గెలుపొందాలనే కసితో ఉంది. అందులో భాగంగా కమలం పార్టీ భారీ వ్యూహం రచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter