తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ముస్లిం రెస్టారెంట్ .. హిందూ ముస్లింలకు వేర్వేరు బిర్యానీ సరఫరా చేస్తోంది. ఆ రెస్టారెంట్ పేరు మాషా అల్లాహ్.. రెస్టారెంట్. ముఖ్యంగా ఇందులో హిందువులకు వేరుగా.. ముస్లింలకు వేరుగా బిర్యానీ వండుతున్నారు. హిందువులకు సరఫరా చేసే బిర్యానీలో కుటుంబ నియంత్రణ మాత్రలు కలుపుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వార్త ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఐతే దీని వెనుక ఎలాంటి నిజానిజాలు దాగున్నాయని పరిశోధన చేస్తే. . ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న వైరల్ సమాచారం వెనుక అసలు నిజం బయటపడింది. మాషా అల్లాహ్ రెస్టారెంట్ యజమాని రెహమాన్ బిస్మిల్లాను అరెస్ట్ చేశారని.. ఆ వ్యక్తి ఇతడే అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన హిందువుల కోసం తయారు చేసిన బిర్యానీలో కలుపుతున్న కుటుంబ నియంత్రణ ట్యాబ్లెట్లు కూడా ఇవిగో.. అంటూ ఫోటోలు పంపుతున్నారు.
Read Also: అనుష్క నిశ్శబ్దం.. అదిరింది..!!
దీనిపై కోయంబత్తూరు పోలీసులు స్పందించారు. కోయంబత్తూరులో అలాంటి రెస్టారెంట్ ఏదీ లేదని చెప్పారు. పైగా తాము ఎవరినీ అరెస్ట్ చేయలేదని.. ఇక్కడ అలాంటి బిర్యాణీ ఎవరూ వండడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా కేవలం ఫేక్ న్యూస్ మాత్రమేనని తెలిపారు. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
Don’t spread fake news. Be responsible user of social media. No one should believe this tweet handle as it is spreading fake news. CCP is working to trace this handle.
— Coimbatore City Police (@policecbecity) March 2, 2020
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల్లో బిర్యానీ వడ్డిస్తున్న వ్యక్తి ఫోటో. . యూట్యూబ్ లోని ఓ వీడియోలో థంబ్ నెయిల్ గా వాడిన దానికి సంబంధించినది. ఈ వీడియోలో కేవలం చికెన్ బిర్యాణీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నారు. అంతే..!!
మరోవైపు ట్యాబ్లెట్లకు సంబంధించిన ఫోటో వెనుక మరో కథ ఉంది. ఆ ఫోటోలో ఉన్నది అబార్షన్ కలిగించే ట్యాబ్లెట్లే.. కానీ వాటిని శ్రీలంకలో పోలీసులు ఈస్టర్ సందర్భంగా దాడి చేసి పట్టుకున్నారు.
Read Also : పెగ్గు తాగితే కరోనా వైరస్ రాదా..?
ఐతే మూడు, నాలుగు ఫోటోలతో నెటిజనులు... సోషల్ మీడియాలో తమ కథనాన్ని అల్లేశారు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఈ ఫోటోలకు ఏం సంబంధం లేదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..