Patna High Court: భూతం, పిశాచం అనడం క్రూరత్వం కిందకురాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోర్టు..

Patna High Court:కొన్నిసార్లు భార్యభర్తలు ఒకరిని మరోకరు నోటికొచ్చినట్లు తిట్టుకుంటారు. కొందరు ఒక అడుగు ముందుకేసి అందరి ముందే గొడవలుపడటం, కొట్టుకొవడం వంటివి కూడా చేస్తారు. ఈక్రమంలో ఒక జంట గొడవలు పడి కోర్టులోకి రావడంతో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు  చేసింది.   

Written by - Inamdar Paresh | Last Updated : Mar 31, 2024, 05:01 PM IST
  • భార్యభర్తల గొడవలసపై కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..
  • మాజీ భర్త తనను నోటికొచ్చినట్లు తిట్టాడని మహిళ పిటిషన్..
Patna High Court: భూతం, పిశాచం అనడం  క్రూరత్వం కిందకురాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోర్టు..

Patna High Court Sensational Comments On Family Divorce Case: మనలో చాలా మంది భార్యభర్తలు పెళ్లాయ్యాక గొడవలు పడుతుంటారు. కొత్తగా పెళ్లాయ్యాక.. ఇద్దరు పెరిగిన వాతావరణం, ఉన్న పరిస్థితులు కాస్తంతా భిన్నంగా ఉంటాయి.దీంతో ఇంట్లో గొడవలు జరగటం సర్వసాధారణం. కానీ కొందరు దీనికి అతిగా ప్రవర్తిస్తుంటారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తుంటారు. భార్యలతో గొడవలు పడటానికి కొత్త కొత్త రూట్లు వెతుకుతుంటారు. కొందరు భార్య చీరకట్టసరిగ్గాకట్టుకోలేదని వేధిస్తుంటారు. మరికొందరు భార్య కూరలో ఉప్పుసరిగ్గా వేయలేదని, భార్యకు ఇంటి పనులు రావని వేధిస్తుంటారు. ఇక భార్యలు కూడా తమ భర్త అసమర్థుడని, జీతం ఎక్కవగా లేదని,ఆస్తిపాస్తులు లేవని, మోసం చేసి పెళ్లి చేసుకున్నారని షాడిజం చూయిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. కొందరు గొడవలు పడి నాలుగు గోడల మధ్య సమస్యలను పరిష్కరించుకుంటారు. కానీ మరికొందరు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తారు.ఇంట్లో జరిగిన విషయాలను అందరి మధ్య తీసుకెళ్తారు.

Read More: Viral Video: వీడేం షాడిస్టురా నాయన.. చికెన్ టెస్టీగా వండలేదని భార్యను ఇంత ఘోరమా.?.. వైరల్ వీడియో..

అది కాస్త ఈగోలకు దారితీస్తుంది. కొందరు భర్తలు, భార్య అందంగాలేదని గొడవలు పడుతుంటారు. దీంతో ఈ వ్యవహారం కాస్త కోర్టులకు వెళ్లి డైవర్సీలకు వరకు వెళ్తుంటారు.ఈ క్రమంలో ప్రస్తుతం.. పట్నా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.

 

పూర్తివివరాలు..

జార్ఖండ్ లోని బోకారోకు చెందిన నరేశ్ కుమార్ గుప్తా, ఆయన తండ్రి సహాదేవ్ గుప్తాలపై, నరేష్ భార్య, బిహార్ లో కేసు పెట్టింది. వీరిద్దరికి కొంత కాలంలో గొడవలు జరుగుతన్నాయి. ఈ క్రమంలోనే భార్యభర్తల కేసు నలందాకు బదిలీచేశారు. దీంతో కోర్టు వీరికి 2008 లో ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ఆతర్వాత సెషన్స్ కోర్టు ఇచ్చిన అప్పీలును పదేళ్లతర్వాత కోర్టు కొట్టేసింది.

Read More: Teen Girl reel At Airport: ఎయిర్ పోర్టులో యువతి రచ్చ.. లగేజీ ట్రాలీపై పడుకొని రీల్స్.. వైరల్ గా మారిన వీడియో..

ఈలోపు దంపతులు జార్ఖండ్ హైకోర్టులో డైవర్స్ కీ అప్లై చేశారు. ఆ తర్వాత సదరు మహిళ.. తనను మాజీ భర్త నోటికొచ్చినట్లు దెయ్యం, పిశాచం అని పిలిచాడని కోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన కోర్టు భార్యభర్తలు విడిపోయాక.. ఒకర్నిమరోకరు దూశించుకోవడం చేస్తుంటారని, ఇది క్రూరత్వం కిందకు రాదంటూ ఈ కేసును కొట్టివేసింది. అంతే కాకుండా వీరికి డైవర్స్ కూడా మంజురు చేసింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News