Bihar Election Result Live: పుంజుకున్న ఎన్డీఏ.. సగానికి పైగా స్థానాల్లో ఆధిక్యం

బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్డీఏ, మహాఘట్‌బంధన్ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది. మరి కాసేపట్లో బీహార్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై ఒక స్పష్టతరానుంది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో మొదట కూటమి ఆధిక్యంలో ఉండగా.. ఎన్డీఏ అనూహ్యంగా పుంజుకొని సగానికి పైగా స్థానాల్లో పూర్తిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతోంది.

Last Updated : Nov 10, 2020, 11:58 AM IST
Bihar Election Result Live: పుంజుకున్న ఎన్డీఏ.. సగానికి పైగా స్థానాల్లో ఆధిక్యం

Bihar Election Result 2020 Update: పాట్నా: బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్డీఏ, మహాఘట్‌బంధన్ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది. మరి కాసేపట్లో బీహార్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై ఒక స్పష్టతరానుంది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో మొదట కూటమి ఆధిక్యంలో ఉండగా.. ఎన్డీఏ అనూహ్యంగా పుంజుకొని సగానికి పైగా స్థానాల్లో పూర్తిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ ( BJP - JDU) కూటమి ప్రస్తుతం 125 స్థానాల్లో పూర్థిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మహాఘట్‌బంధన్ (RJD- Congress-Left) 101 సీట్లలో ఆధిక్యంలో ఉంది. Also read: Bihar Election Result Live: పోటా పోటీ ఆధిక్యంలో ఎన్డీఏ, కూటమి

అయితే ఎన్నికల సంఘం ట్రెండ్స్ ప్రకారం.. 
ఎన్డీఏ 125 సీట్లల్లో లీడ్‌లో ఉంది. BJP 70, JDU 48, VIP 6, HAM 1 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. 
మహాఘట్‌బంధన్ 101 స్థానాల్లో లీడ్‌లో ఉంది.  RJD 62, Congress 20, Left 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 
దీంతోపాటు BSP 1, LJP 5, AIMIM 2, independents 4 స్థానాల్లో ముందజలో ఉన్నారు.
అయితే వాల్మీకినగర్ ఎంపీ స్థానంలో JDU అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు. 

 

Bihar Election Result: బీహార్ కింగ్ ఎవరు?.. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News