న్యూఢిల్లీ: బీహార్‌లో జాతీయ పౌర పట్టిక (NRC)పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి తన వైఖరిని స్పష్టంచేశారు. బీహార్‌లో ఎన్ఆర్‌సి అమలు ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన నితీష్ కుమార్... దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరపట్టిక (NRC), జాతీయ జనాభా పట్టిక (NPR) వంటి అంశాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంటే.. ఇంకా బీహార్‌లో ప్రశ్న ఎక్కడిది అని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీలో సోమవారం సీఎం నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్‌సి అనేది అస్సాం రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన విషయం అనేది మనమంతా గుర్తుంచుకోవాల్సిన విషయం అని నితీష్ కుమార్ అన్నారు.
ఎన్డిఏ భాగస్వామి అయిన నితీష్ కుమార్ ఎన్ఆర్‌సి, ఎన్‌పిఆర్, సిఎఎలపై వారి వైఖరి ఏంటో స్పష్టంచేయాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ చేసిన డిమాండ్‌కి స్పందిస్తూ సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ''జాతీయ పౌర జాబితా అనేది దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం లేదని.. అలా చేయాలనుకోవడంలో అర్థమే లేదన్న నితీష్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని స్పష్టంచేశారనుకుంటా'' అని పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బీహార్‌లో ఎన్ఆర్‌సి అమలుపై స్పందించిన నితీష్ కుమార్