Bharat Biotech starts ‘Covaxin’ 3rd Phase trials: హైదరాబాద్: ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ (Bharat Biotech) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్ దేశ్యావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి, రెండో దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఉత్తమ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DGCI) కోవ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలకు ఇటీవలనే అనుమతి ఇవ్వడంతో.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సోమవారం ప్రారంభమయ్యాయి.
Phase 3 clinical trial of COVAXIN™️ takes off as the largest efficacy trial ever conducted in India, with about 26,000 participants. pic.twitter.com/qyCkoOkUl9
— BharatBiotech (@BharatBiotech) November 16, 2020
అయితే ఈ కోవాక్సిన్ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో.. 26వేల మంది వలంటీర్లపై ప్రయోగించనున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. అయితే మొదటి, రెండో దశలో వెయ్యి మందికిపైగా వ్యక్తులపై ప్రయోగాలు నిర్వహించగా.. తుది దశలో పెద్ద మొత్తంలో 26వేల మందిపై ప్రయోగాలు చేపట్టనున్నట్లు సంస్థ తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం ఇదే మొదటిసారని సంస్థ ప్రకటించింది. అయితే ఈ కోవ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుబాటులోకి రానుంది. Also read: RRR Movie: చలికి వణుకుతున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. వీడియో వైరల్
Also read: Allu Arjun: అభిమానితో ఫొటోలు దిగిన పుష్పరాజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి