Covid19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీ ఇప్పుడు పూర్తిగా కేంద్ర భద్రతా బలగాల గుప్పెట్లో వెళ్లిపోయింది. భారత్ బయోటెక్ కంపెనీ సీఐఎస్ఎఫ్ రక్షణ కవచంలో వెళ్లిపోతోంది. ఎందుకీ ఏర్పాట్లు, ఏం జరిగింది..
దేశంలో కరోనా మహమ్మారికి ఏకైక పరిష్కారం వ్యాక్సినేషన్. మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ (Covaxin) ఉత్పత్తి చేస్తున్న కంపెనీ హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కంపెనీ. శామీర్‌పేట్‌లో ఉన్న ఈ కంపెనీ ఇక కేంద్ర భద్రతా బలగాల గుప్పెట్లో వెళ్లిపోనుంది. భారత్ బయోటెక్ కంపెనీకు సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రత కల్పించనున్నారు. ఫలితంగా ఇకపై ఈ కంపెనీ మొత్తం మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోల పర్యవేక్షణలో ఉండబోతోంది. వచ్చేవారమే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ప్లాంట్‌ను తమ ఆధీనంలో తీసుకోబోతోంది. ఉగ్రవాదుల ముప్పు నేపధ్యంలో భారత్ బయోటెక్ కంపెనీకు (Bharat Biotech) భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
దేశ వైద్య ఆరోగ్య భద్రత విషయంలో భారత్ బయోటెక్ ఓ ముఖ్యమైన సంస్థ అని..ఉగ్రవాద ముుప్పుని ఎదుర్కొనే అవకాశమున్నందున భారత్ బయోటెక్ కంపెనీకు సీఐఎస్ఎఫ్ భద్రత (CISF Security) కల్పించనున్నామని కేంద్ర హోంశాఖ తెలిపింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ భద్రతా నిపుణుల సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also read: Madhya Pradesh: మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు తీవ్ర అస్వస్థత, మేదాంత ఆసుపత్రిలో చికిత్స
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook