Suchetana Bhattacharya: సంచలనం.. పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కూతురు!

Suchetana Bhattacharya: పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య కుమార్తె సుచేతన లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు సుచేతన. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2023, 08:18 PM IST
Suchetana Bhattacharya: సంచలనం.. పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కూతురు!

Bengal former CM Buddhadeb Bhattacharya's Daughter To Undergo Sex-Change Operation: సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకునేందుకు రెడీ అయ్యారు. ఇదే విషయంపై న్యాయ నిపుణులు, వైద్యులు, ఇతర నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా  ఎల్‌జీబీటీక్యూ ఉద్యమంలో సుచేతన పాల్గొని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 

''నా వయసు 41. నాకు సంబంధించిన నిర్ణయాలన్నీ నేనే తీసుకుంటా. నా బాడీలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. అందుకే లింగ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నా. దయచేసి నా తల్లిదండ్రులను ఈ వ్యవహారంలోకి లాగొద్దు. నేను మెుదటి నుంచి మానసికంగా పురుషుడిలాగే ఉన్నాను. ఇప్పుడు శారీరకంగా మగవాడిలా మారాలనుకుంటున్నాను. నా గురించి మా నాన్నకు చాలా బాగా తెలుసు. ఈ ఆపరేషన్ కు ఆయన ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నా'' అని సుచేతన వివరించారు. అయితే ఇది తన సొంత నిర్ణయమని.. దీనిపై ఎవరూ రాద్ధాంతం చేయవద్దని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. 

Also Read: Malli Pelli On OTT: ఇవాళ్టి రాత్రి నుంచే ఓటిటిలోకి రానున్న ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

బెంగాల్ సీఎంగా బుద్ధదేవ్ భట్టాచార్య పది సంవత్సరాలు పనిచేశారు. 2001 నుంచి 2011 వరకు ఆయన ముఖ్యమంత్రిగా సేవలందించారు. కొన్నేళ్ల కిందట ఈయన మరదలైన ఇరా బసు రోడ్లపై బిక్షాటన చేస్తూ కనిపించిన వార్త నెట్టింట విపరీతంగా వైరల్ అయిది. మా బావ సీఎంగా ఉన్నప్పటికి తన పింఛన్ సమస్య పరిష్కారం కాలేదని అప్పట్లో ఆమె తెలిపారు. ఈ కారణంచేత తన సోదరి మీరా భట్టాచార్య దంపతులపై కోపం పెంచుకోలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. 

Also Read: HBD Vijay: దళపతి విజయ్ బర్త్ డే.. 'లియో' ఫస్ట్ లుక్ అదుర్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News