మీ దగ్గర తక్కువ డబ్బులుంటే ఇప్పుడు ఏటీఎంకి వెళ్లి కావాల్సింత తీసుకొని జాగ్రత్త పడండి. ఎందుకంటే అసలే నెలాఖారు రోజులు. అలాగే జీతాలు పడే రోజులు. వీటన్నింటితో పాటు మార్చి 29వ తేది నుండి వరుసగా అయిదు రోజులు బ్యాంకులు సెలవులు ప్రకటిస్తున్నాయి కాబట్టి మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ..! ఎందుకంటే మార్చి 29వ తేది మహావీర్ జయంతి సందర్భంగా సెలవుదినం కాగా.. 30వ తేదిన గుడ్ ఫ్రైడే.. ఆ తర్వాత రోజులు యథావిధిగా శనివారం, ఆదివారాలు వస్తున్నాయి.
ఆ మరుసటి రోజు ఏప్రిల్ 2వ తేది నాడు ఏడాది కాలం పాటు నిర్వహించిన అకౌంట్స్ క్లోజ్ చేసే రోజు కాబట్టి.. ఆ రోజు కూడా ఖాతాదారులకు సెలవే. ఈ సెలవు దినాలు కేవలం బ్యాంకులకు మాత్రమే కాదు. డబ్బును ఏటీఎంలకు పంపించే ఏజెన్సీలకు కూడా కావడం వల్ల జనులు కాస్త జాగ్రత్త పడాలి. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ప్రస్తుతం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ప్రైవేటైజేషన్ చేసే దిశగా కూడా నీతి ఆయోగ్ ఆలోచన చేస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ 5 రోజులు బ్యాంకులకు సెలవు