Bank Holidays: నవంబర్‌లో ఏకంగా సగం రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడు, ఎక్కడ

Bank Holidays: ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ లావాదేవీలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు లభిస్తున్నా ఇంకా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గడం లేదు. కొన్ని పనులకైతే బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే ఏ నెలలో బ్యాంకులకు సెలవులున్నాయో తెలుసుకోవడం మంచిది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 29, 2023, 01:44 PM IST
Bank Holidays: నవంబర్‌లో ఏకంగా సగం రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడు, ఎక్కడ

Bank Holidays: దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా సెలవుల క్యాలెండర్ ఇస్తుంటుంది. ఇందులో పబ్లిక్ హాలిడేస్‌తో పాటు జాతీయ, ప్రాంతీయ సెలవులుంటాయి. ఇప్పుడు నవంబర్ నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

నవంబర్ నెలలో వారాంతపు సెలవులు ఇలా

నవంబర్ 5 ఆదివారం సెలవు
నవంబర్ 11 రెండవ శనివారం సెలవు
నవంబర్ 12 ఆదివారం సెలవు
నవంబర్ 19 ఆదివారం సెలవు
నవంబర్ 25 నాలుగవ శనివారం సెలవు
నవంబర్ 26 ఆదివారం సెలవు

అంటే నవంబర్ నెలలో ఆరు రోజులు వీక్లీ హాలిడేస్ ఉన్నాయి. ఇవి దేశమంతా దాదాపుగా ఒకేలా ఉంటాయి. వీక్లీ హాలిడేస్‌లో బ్యాంకులు మూసివేసి ఉన్నా...ఆన్‌లైన్ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, ఇంటర్నెట్ పేమెంట్స్, నెట్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం సేవలు కొనసాగుతాయి. ఇక మిగిలిన జాతీయ, ప్రాంతీయ సెలవులు ఇలా ఉన్నాయి..

నవంబర్ 1 బెంగళూరు, ఇంఫాల్, సిమ్లాలో కర్వా చౌత్, కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా సెలవు
నవంబర్ 10న గోవర్ధన్ పూజ, లక్ష్మీపూజ, దీపావళి పురస్కరించుకుని షిల్లాంగ్‌లో సెలవు
నవంబర్ 13 లక్ష్మీపూజ, దీపావళి కారణంగా అగర్తల, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జైపూర్, లక్నో, కాన్పూర్‌లో సెలవు
నవంబర్ 14న దీపావళి, లక్ష్మీపూజ, విక్రమ సంపత్ నామ సంవత్సరం కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, గ్యాంగ్‌టక్,  ముంబై, నాగపూర్‌లో సెలవు
నవంబర్ 15న భాయ్ దూజ్, లక్ష్మీ పూజ కారణంగా గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
నవంబర్ 20న ఛత్ పూజ కారణంగా పాట్నా, రాంచీలో బ్యాంకులకు సెలవు
నవంబర్ 23న డెహ్రాడూన్, షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు
నవంబర్ 27న గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి కారణంగా బ్యాంకులకు సెలవు
నవంబర్ 30న కనకదాస్ జయంతి పురస్కరించుకుని బెంగళూరులో బ్యాంకులకు సెలవు

Also read: Kerala Blast: కేరళలో భారీ పేలుడు, ఒకరి మృతి, 40 మందికి గాయాలు, రాష్ట్రమంతటా అలర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News