/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

MBBS interns to have AYUSH training: ఎంబిబిఎస్ విద్యార్థులు (MBBS students) మెడిసిన్ పూర్తి చేసిన అనంతరం ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వారి ఇతర పోస్టింగ్‌లతో పాటు త్వరలోనే ఆయుష్‌లోనూ ఇంటర్న్‌షిప్ శిక్షణ (internship in AYUSH) పొందాల్సి ఉంటుంది.

నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) విడుదల చేసిన డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ప్రకారం రొటేటింగ్ ఇంటర్న్‌షిప్, 2021 లో భాగంగా భారతీయ వైద్య విధానాలలో ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకొని, అందులో ఒక వారం శిక్షణ పొందాల్సి ఉంటుంది.

అలాగే, కార్డియాలజీ, నెఫ్రాలజీ, పల్మనరీ మెడిసిన్, మెడికల్ ఆంకాలజీ (cardiology, nephrology, pulmonary medicine, and medical oncology) వంటి సూపర్ స్పెషాలిటీ మెడిసిన్ సబ్జెక్టుల్లో ఏవైనా రెండు సూపర్‌స్పెషాలిటీ విభాగాలలో ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్‌ సమయంలో ఒక్కో వారం చొప్పున శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.

Also read : COVID pandemic bonus: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు good news.. కరోనా ప్యాండెమిక్ బోనస్‌

గ్రాడ్యుయేషన్ తర్వాత 12 నెలల వ్యవధిలో ఎంబిబిఎస్ విద్యార్థులు రొటేషనల్ షెడ్యూల్లో పూర్తి చేయాల్సిన 17 పోస్టింగ్స్‌లో 14 సబ్జెక్టులు తప్పనిసరివి కాగా మరో మూడు ఎలిక్టివ్స్ ఉంటాయి. సూపర్‌స్పెషాలిటీ విభాగాలలో శిక్షణ, భారతీయ వైద్య విధానాలు ఈ ఎలక్టివ్స్‌లో భాగంగా ఉంటాయి. అలాగే, ఆయుష్ (AYUSH) కోసం ఆయుర్వేదం, యోగా, యునాని, హోమియోపతి, సిద్ధ సోవా రిగ్పా (ayurveda, yoga, unani, homeopathy and Siddha Sowa Rigpa) నుండి ఇంటర్న్‌లు ఏదైనా ఎన్నుకోవచ్చని కమిషన్ పేర్కొంది.

ఎంబిబిఎస్ ఇంటర్న్‌షిప్‌లో (MBBS internship) సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో శిక్షణ వల్ల విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై మంచి అవగాహన వస్తుందని ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఒక ఇంటర్న్ తెలిపారు.

Also read : Kappa variant cases: ఉత్తర్ ప్రదేశ్‌లో కప్ప వేరియంట్ కేసులు

ఎంబీబీఎస్ ఇంటర్న్‌లు (MBBS interns) తమ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించిన రికార్డును లాగ్‌బుక్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్ చేసే వారి రిపోర్టింగ్ మెడికల్ ఆఫీసర్ ఆ లాగ్‌బుక్ రికార్డును ధృవీకరించాల్సి ఉంటుంది. NMC ఈ తరహా మార్గదర్శకాలు (MBBS internship guidelines) ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమానార్హం. కరోనావైరస్ (COVID-19) మహమ్మారి వ్యాప్తి అనంతరం ఎదురైన పరిస్థితుల దృష్ట్యానే ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
AYUSH training to be included in MBBS internship for MBBS students: NMC
News Source: 
Home Title: 

AYUSH training for MBBS interns: ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు ఆయుష్‌లో ట్రైనింగ్

AYUSH training for MBBS interns: ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు ఆయుష్‌లో ట్రైనింగ్
Caption: 
Representational image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
AYUSH training for MBBS interns: ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు ఆయుష్‌లో ట్రైనింగ్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, July 10, 2021 - 10:11
Request Count: 
83
Is Breaking News: 
No