Axis Bank Bumper Offer: యాక్సిస్ నుంచి కళ్లు చెదిరే ఆఫర్, 12 నెలలు ఈఎంఐ మాఫీ

Axis Bank Bumper Offer: హోమ్‌లోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది యాక్సిస్ బ్యాంక్. ఎంపిక చేసిన హోమ్‌లోన్‌లపై ఏకంగా 12 నెలల వరకూ ఈఎంఐ మాఫీ చేస్తోంది. ఆశ్చర్యంగా ఉందా. నిజమే ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 20, 2021, 10:47 AM IST
  • హోమ్‌లోన్స్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించిన యాక్సిస్ బ్యాంక్
  • ఎంపిక చేసిన హోమ్‌లోన్స్‌పై 12 నెలల వరకూ ఈఎంఐ మాఫీ ప్రకటన
  • హోమ్‌లోన్స్ ఈఎంఐ మాఫీకు అర్హతల్ని వెల్లడించిన యాక్సిస్ బ్యాంక్
Axis Bank Bumper Offer: యాక్సిస్ నుంచి కళ్లు చెదిరే ఆఫర్, 12 నెలలు ఈఎంఐ మాఫీ

Axis Bank Bumper Offer: హోమ్‌లోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది యాక్సిస్ బ్యాంక్. ఎంపిక చేసిన హోమ్‌లోన్‌లపై ఏకంగా 12 నెలల వరకూ ఈఎంఐ మాఫీ చేస్తోంది. ఆశ్చర్యంగా ఉందా. నిజమే ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.

బ్యాంకుల మధ్య పోటీ వివిధ రకాల ఆఫర్లకు దారితీస్తోంది. కస్టమర్లకు బంపర్ ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ప్రైవేటు బ్యాంకు యాక్సిస్ బంపర్ ఆఫర్(Axis Bank Bumper Offer)ప్రకటించింది. అది కూడా హోమ్‌లోన్స్ కస్టమర్లకు. దసరాకు ఆన్‌లైన్ కొనుగోళ్లపై పలు డిస్కౌంట్లు ప్రకటించిన యాక్సిన్ బ్యాంకు..ఈసారి హోమ్‌లోన్స్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన హోమ్‌లోన్ ప్రొడక్ట్స్‌కు ఏకంగా 12 నెలల ఈఎంఐను మాఫీ(12 Months of Home loan EMI Write Off)చేస్తున్నామని యాక్సిస్ బ్యాంకు వెల్లడించింది. టూ వీలర్ కస్టమర్లకు ఏ విధమైన ప్రోసెసింగ్ ఫీజు లేకుండా రోడ్ ఫైనాన్స్ అరేంజ్ చేయనుంది. ఆశ్యర్యంగా ఉన్నా..నిజమే ఇది. హోమ్‌లోన్ మాఫీ ఎవరెరవరికి వర్తిస్తుంది, కండీషన్స్ ఏంటనే వివరాల్ని కూడా తెలిపింది. 

హోమ్‌లోన్స్‌పై(Home Loans)రెగ్యులర్ చెల్లింపులు చేస్తున్నవారికి ఏ విధమైన అదనపు పేమెంట్ లేకుండా 12 నెలల ఈఎంఐను మాపీ చేస్తుంది. పదేళ్లపాటు కట్టినవారికి మరో 6 నెలల రుణమాఫీ వర్తిస్తుంది. మరో 15 ఏళ్లు కట్టినవారికి ఇంకొక ఆరు నెలల రుణమాఫీ సౌకర్యం కలుగుతుంది. అయితే రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ పూర్తి క్లీన్‌గా ఉండాలి. కేవలం మూడు సందర్భాల్లోనే 30 రోజులవరకూ ఆలస్యమైనా ఫరవాలేదు. లోన్‌టైమ్ మొత్తంలో 90 రోజులకు మించి ఆలస్యమైతే ఈ పథకానికి అనర్హులు. రుణం తీసుకున్న కాలపరిమితి కనీసం 20 ఏళ్ల కంటే ఎక్కువై ఉండాలని యాక్సిస్ బ్యాంకు(Axis Bank)తెలిపింది. 

Also read: Vaccination Drive: కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై కీలక సూచనలు చేసిన కేంద్ర ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News