Ola, Uber, Rapido Autos: మరో మూడు రోజుల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలు బంద్

Ola, Uber, Rapido Auto Services: ఓలా, ఉబర్, రాపిడో లాంటి యాగ్రిగేటర్స్ అందిస్తున్న ఆటో రిక్షా సేవలు మరో మూడు రోజుల్లో నిలిపేయాలని కర్ణాటక సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఓలా, ఉబర్, రాపిడో యాగ్రిగేటర్స్‌కి నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం.. వాటికి మూడు రోజుల గడువు విధిస్తూ ఆలోగా ఆటోరిక్షా సేవలు నిలిపేయాలని తేల్చిచెప్పింది.

Written by - Pavan | Last Updated : Oct 7, 2022, 09:56 PM IST
Ola, Uber, Rapido Autos: మరో మూడు రోజుల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలు బంద్

Ola, Uber, Rapido Auto Services: ఆటో రిక్షాలు ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తం కంటే అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నాయని ఇటీవల కాలంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం ఇందుకు ఒక కారణమైతే.. ఆన్-డిమాండ్ ట్రాన్స్ పోర్టేషన్ టెక్నాలజీ యాక్ట్ 2016 ప్రకారం ఆటో రిక్షా సేవలు చట్టవిరుద్ధం అవుతాయనేది మరో కారణంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదేశాల్లో పేర్కొంది. 

ఆన్-డిమాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ యాక్ట్ 2016 ప్రకారం ఓలా, ఉబర్, రాపిడో లాంటి ట్రాన్స్‌పోర్టేషన్ యాగ్రిగేటర్స్‌కి క్యాప్ సర్వీసులు అందించడానికి మాత్రమే అనుమతి ఉందని... కానీ ఆయా యాగ్రిగేటర్స్ అందిస్తున్న ఆటో రిక్షా సేవలకు చట్టరీత్యా అనుమతి లేదని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ టిహెచ్ఎం కుమార్ స్పష్టం చేశారు. మోటార్ క్యాబ్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం డ్రైవర్ సీటు కాకుండా 6 సీట్లకు మించని వాహనాలు, కార్లకు అనుమతి ఉంటుందని.. ఆటోరిక్షాలు ఆ పరిధిలోకి రావని రవాణా శాఖ కమిషనర్ టిహెచ్ఎం కుమార్ వివరించారు.  

ఓలా, ఉబర్, రాపిడో యాగ్రిగేటర్స్‌కి నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం.. వాటికి మూడు రోజుల గడువు విధిస్తూ ఆలోగా ఆటోరిక్షా సేవలు నిలిపేయాలని తేల్చిచెప్పింది. మూడు రోజుల తర్వాత ఆటోరిక్షా సేవలు కొనసాగించడానికి వీల్లేదని ఓలా, ఉబర్, రాపిడో వంటి యాగ్రిగేటర్స్‌కి ఇచ్చిన నోటీసుల్లో ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీచేసింది. ఇదిలాఉంటే మరోవైపు బెంగళూరులోని ఆటోడ్రైవర్స్ సైతం యాగ్రిగేటర్స్ కి స్వస్తి చెప్పి సొంతంగా రూపొందించిన యాప్ ఉపయోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 1న నమ్మ యాత్రి అనే యాప్ లాంచ్ కాబోతున్నట్టు బిజినెస్ స్టాండర్డ్ ప్రచురించిన వార్తా కథనం పేర్కొంది.

Trending News