కోయంబత్తూర్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా 20 మంది దుర్మరణం చెందారు. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా తిరుమురుగన్ పూండి సమీపంలో గురువారం వేకువ జామున ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: భారతీయుడు 2 షూటింగ్‌లో ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి దుర్మరణం
పోలీసుల కథనం ప్రకారం.. ట్రక్కు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అతివేగంతో దూసుకొచ్చిన ట్రక్కు, కర్ణాటక ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కేఎస్ ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి ఎర్నాకుళం వెళ్తుండగా అవినాషి-సేలం బైపాస్ వద్దకు రాగానే కొచ్చి నుంచి బెంగళూరు వైపు టైల్స్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఆర్టీసీ బస్సును ఢీకొంది. గురువారం వేకువజామున ఉదయం 3:25 గంటలకు ఘటన చోటుచేసుకుంది.
Also Read: ముగ్గురు సహోద్యోగుల్ని కోల్పోయా: కమల్ హాసన్ భావోద్వేగం
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులున్నారు. కాగా, ట్రక్కు డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిద్రపోవడంతో వేరే లైన్‌లోకి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. ఎర్నాకుళం వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం.. 20 మంది దుర్మరణం