ప్రభుత్వ విద్యకు నిధుల నిర్లక్ష్యం తగదు: తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్ట్

యూనివర్సిటీలో ఫీజుల పెంపుపై ఢిల్లీ హైకోర్టులో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థుల సంఘం నాయకులు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కొనసాగించాలని, నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. కాగా వచ్చే సెమిస్టర్‌కు ఇంతవరకు నమోదు చేసుకోలేని విద్యార్థులు వచ్చే వారంలోపు

Last Updated : Jan 24, 2020, 06:00 PM IST
ప్రభుత్వ విద్యకు నిధుల నిర్లక్ష్యం తగదు: తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్ట్

న్యూఢిల్లీ: యూనివర్సిటీలో ఫీజుల పెంపుపై ఢిల్లీ హైకోర్టులో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థుల సంఘం నాయకులు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కొనసాగించాలని, నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. కాగా వచ్చే సెమిస్టర్‌కు ఇంతవరకు నమోదు చేసుకోలేని విద్యార్థులు వచ్చే వారంలోపు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి అనుమతించాలని కోర్టు విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. విద్యార్థులకు ప్రీ-హైక్ ఫీజు ప్రకారం వర్తించే విధంగా చెల్లించడానికి అనుమతించాలని పరిపాలన విభాగాన్ని కోరారు.
 
యూనివర్సిటీలో ఫీజుల పెంపును సవాలు చేసిన జేఎన్ యూ విద్యార్ధి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్‌తో సహా జేఎన్ యూ స్టూడెంట్స్ యూనియన్ నాయకుల బృందం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. 

అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ వాదిస్తూ, పిటిషన్ ను వెంటనే తిరస్కరించాలని ఢిల్లీ హైకోర్టును కోరారు. 90 శాతం మంది విద్యార్థులు ఇప్పటికే తమ సెమిస్టరు రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకున్నారని, కేవలం పది శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని తెలిపారు.

జస్టిస్ రాజీవ్ శక్తిధర్ స్పందిస్తూ, అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ చేసిన వాదనను కొట్టిపారేశారు. పెంచిన ఫీజు కట్టలేని పరిస్థితిలో విద్యార్థులున్నప్పుడు పిటిషన్ ను తిరస్కరించమని ఎలా చెబుతారని ప్రశ్నించారు.  

విశ్వవిద్యాలయం నియమించిన కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించడానికి ఫీజులు సవరించబడుతున్నాయని, ఫీజుల పెంపును సమర్థిస్తున్న సెంటర్స్ సీనియర్ లా ఆఫీసర్ వాదనను  జస్టిస్ శక్తిధర్ తీవ్రంగా ప్రతిఘటించారు.

ప్రభుత్వ విద్యకు ప్రభుత్వం నిధులు సమకూర్చాలని, కాంట్రాక్టు కార్మికుల జీతాలు చెల్లించే భారం విద్యార్థులపై ఉండకూడదని, దానికి ప్రత్యామ్నాయ నిధులు ఏర్పాటు చేయాలని జస్టిస్ శక్తిధర్ సూచించారు. ఇక తదుపరి విచారణను న్యాయమూర్తి ఫిబ్రవరి 28కి వాయిదా వేశారు

జే ఎన్ యూ విద్యార్ధి యూనియన్ ఆఫీస్‌ బేరర్‌లు పిటిషన్‌లో జోక్యం చేసుకుని హాస్టల్‌ గదుల వసతి కల్పనలో, ఫీజు నిర్మాణంలో చేసిన మార్పులను వెనక్కి తీసుకోవాలని విశ్వవిద్యాలయ పరిపాలన విభాగాన్ని కోరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News