Assam Golden Pearl Tea: అస్సాం గోల్డెన్ పెర్ల్ టీకు రికార్డు ధర.. కిలో ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

Assam Tea : అస్సాం టీకు రికార్డు ధర పలికింది. గౌహతి టీ వేలం కేంద్రంలో కిలో తేయాకు దాదాపు లక్ష రూపాయలకు అమ్ముడుపోయింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 11:37 AM IST
Assam Golden Pearl Tea: అస్సాం గోల్డెన్ పెర్ల్ టీకు రికార్డు ధర.. కిలో ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

Assam Golden Pearl Tea sold for Rs 99,999 Per Kg: అస్సాం గోల్డెన్ పెర్ల్ టీ రికార్డు క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 14న గౌహతి టీ వేలం కేంద్రం (GTAC)లో కిలో తేయాకు ధర రూ.99,999కు అమ్ముడుపోయింది. దీంతో ఇది గత ఏడాది రికార్డును సమం చేసినట్లయింది. గత ఏడాది డిసెంబర్‌లో ‘'మనోహరి గోల్డ్‌ టీ'కి (Manohari Gold tea) ఇదే రేటు పలికింది. అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాకు చెందిన నహోర్చుక్బరి గోల్డెన్ పెర్ల్ (Nahorchukbari Golden Pearl) టీ సోమవారం కిలో రూ.99,999కు  విక్రయించబడిందని గౌహతి టీ వేలం కొనుగోలుదారుల సంఘం (జీటీఏబీఏ) కార్యదర్శి దినేష్ బిహానీ ఏఎన్‌ఐకి తెలిపారు. ఈ టీని సున్నితంగా చేతితో తయారు చేస్తారు. 

గోల్డెన్ పెర్ల్ టీని (Assam Golden Pearl Tea) అస్సాం టీ ట్రేడర్స్ కొనుగోలు చేశారు. దిబ్రూగఢ్ (Dibrugarh) విమానాశ్రయానికి సమీపంలోని లాహోవల్‌లో ఉన్న ఫ్యాక్టరీ ఉత్పత్తి చేసిన తేయాకు రికార్డు సృష్టించడం ఇదే తొలిసారి. గౌహతిలో ఉన్న గౌహతి టీ వేలం కేంద్రం (GTAC) ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే టీ ట్రేడింగ్ సౌకర్యాలలో ఒకటి. ఇది 1970లో స్థాపించబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సీటీసీ (CTC) టీ వేలం పాటలకు ప్రసిద్ధి. 

ప్రపంచంలోనే అధిక మెుత్తంలో తేయాకు పండించే ప్రాంతం అస్సాం (Assam). ఇక్కడ తేయాకు పండించడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఇక్కడి తేయాకుకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాష్ట్రం గుండా ఇరువైపులా బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది. ఈ ప్రాంతానికి భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, చైనా దేశాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ సాధారణంగా అధిక వర్షపాతం, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. 

Also Read: Mammikka: 60 ఏళ్ల వయసులో మోడల్​గా రోజువారి కూలి- అదృష్టం అంటే అతడిదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News