Army Public School Recruitment 2020: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8000 టీచర్‌ పోస్టులు

Army Public School Recruitment 2020 | ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) దేశ వ్యాప్తంగా పలు కంటోన్మెంట్లు, ఆర్మీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 800 టీచర్ జాబ్స్  (Teacher Jobs 2020) ఉన్నాయి. 

Last Updated : Oct 1, 2020, 04:33 PM IST
  • టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ శుభవార్త
  • దేశ వ్యాప్తంగా పలు కంటోన్మెంట్లు, ఆర్మీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోంది
  • 8000 టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Army Public School Recruitment 2020: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8000 టీచర్‌ పోస్టులు

టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) దేశ వ్యాప్తంగా పలు కంటోన్మెంట్లు, ఆర్మీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 8000 టీచర్ జాబ్స్ ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టింది.  

దేశ వ్యాప్తంగా 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తున్నారు. నేటి (అక్టోబర్ 1వ తేదీ) నుంచే ప్రారంభమైన ధరఖాస్తుల తుది గడువు అక్టోబర్ 20వ తేదీతో ముగియనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 

స్క్రీనింగ్ టెస్టుకు సీటెట్ లేదా టెట్ (TET)లో అర్హత సాధించిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి. దరఖాస్తు చివరితేదీ  అక్టోబర్ 20.

పీజీటీ పోస్టులు (For PGT Posts) : పీజీటీ పోస్టులకు బీఈడీతో పాటు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి
టీజీటీ పోస్టులు (Gor TGT Posts) : టీజీటీ పోస్టులకు బీఈడీతో పాటు డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి
పీఆర్‌టీ పోస్టులు (For PRT Posts) : బీఈడీ లేదా రెండేళ్ల డిప్లొమా గానీ, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
నవంబర్ 21, 22 తేదీలలో పరీక్ష నిర్వహించనున్నారు.  

Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News