మన ఆయుధ సంపత్తి ప్రదర్శనలకేనా?: సంజయ్ రౌత్

ఇది ప్రత్యక్ష యుద్ధం. దాయాది దేశం ప్రతక్షంగా దాడులకు తెగబడుతోంది. భారత్ కూడా పాక్ కు అలానే బుద్ధి చెప్పాలి.

Last Updated : Feb 5, 2018, 02:16 PM IST
మన ఆయుధ సంపత్తి ప్రదర్శనలకేనా?: సంజయ్ రౌత్

భారత ఆర్మీపై శివసేన నేత నోరుజారారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన, కవ్వింపులపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. భారత ఆయుధ సంపత్తిపై ఆరోపణలు చేశారు. భారత్ ఆయుధ సంపత్తిని రాజ్‌పథ్‌లో కేవలం ప్రదర్శన కోసం ఉంచుతోందని.. ప్రశంసల కోసం వాటిని ఉంచుతున్నారని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు.

పాకిస్థాన్ క్షిపణులను ఉపయోగించి భారత జవాన్లపై దాడి చేస్తోందనే ప్రశ్నకు బదులిస్తూ, "పాకిస్తాన్ క్షిపణుల సాయంతో మన జవానులపై దాడులకు తెగబడుతోంది. నిన్న కూడా అలానే జరిగింది (రాజౌరీ జిల్లాలో ఆదివారం జరిగిన కాల్పులలో ఒక ఆర్మీ అధికారి, ముగ్గురు జవాన్లు చనిపోయారు). రిపబ్లిక్‌డే వేడుకలకు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే ముఖ్య అతిథులకు భారత ఆర్మీ ఆయుధాలను ప్రదర్శించి ప్రశంసలు పొందటానికేనా మన ఆయుధాలు, తుపాకులు ఉన్నవి" అని కేంద్రాన్ని ప్రశ్నించారు. "కాల్పుల విరమణ ఉల్లంఘన పక్కకు పెట్టిండి. ఇది ప్రత్యక్ష యుద్ధం. దాయాది దేశం ప్రత్యక్షంగా దాడులకు తెగబడుతోంది. భారత్ కూడా పాక్ కు అలానే బుద్ధి చెప్పాలి" అని రౌత్ అన్నారు.

Trending News