Voter ID Card: ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో తెలుసా, ఇలా చెక్ చేయండి

Voter ID Card: దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు నాలుగో విడతలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 3, 2024, 08:37 PM IST
Voter ID Card: ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో తెలుసా, ఇలా చెక్ చేయండి

Voter ID Card: మీకు 18 ఏళ్లు నిండితే చాలు ఓటు హక్కు పొందుతారు. అయితే ఓటర్ల జాబితాలో మీ పేరుండాలి. లేకపోతే ఇప్పటికీ ఇంకా సమయం ఉంది. ఏప్రిల్ 15 వరకూ ఓటు నమోదు చేసుకోవచ్చు. అందుకే ముందు ఓటర్ల జాబితా చెక్ చేసుకోవాలి. 

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగనుండగా ఏపీలో నాలుగో విడతలో మే 13న జరగనున్నాయి. అటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు కూడా మే 13నే జరగనున్నాయి. ఓటు వేయాలంటే ఓటు హక్కు ఉండాలి. గతంలో ఓటు హక్కు ఉన్నా ఇప్పుడు మిస్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఓటరు జాబితాలో చెక్ చేసుకోవాలి. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్ విధానంలో చెక్ చేసుకోవచ్చు. 

ఓటరు జాబితాలో పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి

ముందుగా ఎన్నికల కమీషన్ అధికారిక వెబ్‌సైట్  https://nvsp.in/ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీకు మూడు ఆప్షన్లు కన్పిస్తాయి. అందులో ఎలక్టోరల్ రోల్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీకు కన్పించే పేజ్‌లో ఓటర్ ఐడీ కార్డు వివరాలు నమోదు చేయాలి. పేరు, వయస్సు, పుట్టిన తేదీ, జెండర్, రాష్ట్రం, జిల్లా వంటి వివరాలు ఎంటర్ చేయాలి. తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అంతే మీ పేరుందో లేదో తెలిసిపోతుంది. 

ఎస్ఎంఎస్ ద్వారా చెక్ చేయడం ఎలా

మీ రిజిస్టర్ మొబైల్ నుంచి మెస్సేజ్ పంపించడం ద్వారా చెక్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా EPIC అని టైప్ చేసి మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత 1950 లేదా 9211728082కు మెస్సేజ్ చేయాలి. అంతే మీకు మీ ఓటు హక్కు, పోలింగ్ నెంబర్ వివరాలతో రిప్లై వస్తుంది. ఓటర్ల జాబితాలో మీ పేరు లేకుంటే ఏ సమాచారం రాదు. 

ఓటరు ఐడీ కార్డు డౌన్‌లోడ్ ఎలా

ముందుగా ఓటరు సర్వీస్ పోర్టల్ ఓపెన్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించాలి. ఇప్పుడు ఫామ్ 6 కన్పిస్తుంది. ఇది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు. ఇ ఎపిక్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఎంటర్ చేసి మీ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయాలి. చివర్లో మరోసారి ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. తరువాత డౌన్‌లోడ్ ఎపిక్ క్లిక్ చేసి ఓటరు ఐడీ కార్డు పొందవచ్చు.

Also read: PPF Updates: ఏప్రిల్ 5 కల్లా ఇన్వెస్ట్ చేయకుంటే భారీగా నష్టం, ఎంతంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News