Rave Party: కర్ణాటకలో మళ్లీ రేవ్‌ పార్టీ కలకలం.. 15 మంది యువతులతో సహా 50 మంది అరెస్ట్‌

Another Rave Party Bust In Karnataka: విచ్చలవిడిగా అశ్లీలత.. మాదకద్రవ్యాల వినియోగంతో ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మరోసారి రేవ్‌ పార్టీతో కర్ణాటకలో కలకలం ఏర్పడింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 30, 2024, 03:11 PM IST
Rave Party: కర్ణాటకలో మళ్లీ రేవ్‌ పార్టీ కలకలం.. 15 మంది యువతులతో సహా 50 మంది అరెస్ట్‌

Rave Party Bust: రేవ్‌ పార్టీలంటే కర్ణాటక అన్నట్టు మారింది. బెంగళూరు రేవ్‌ పార్టీ మరవకముందే మైసూర్‌లో మరో రేవ్‌ పార్టీ కలకలం సృష్టించింది. భారీ ఎత్తున అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. మత్తుపదార్థాల వినియోగం జరగడంతో పోలీసులు దాడులు చేశారు. ఓ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ఈ పార్టీని పోలీసులు భగ్నం చేసి 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 15 మందికి పైగా అమ్మాయిలు ఉన్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తప్పు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Also Read: Crafts Gold Saree: ధగధగలాడే బంగారం చీర.. ఔరా తెలంగాణ చేనేత కళాకారుడి ప్రతిభ

కర్ణాటకలోని మైసూరులో మరో రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మైసూరు తాలూకాలోని మీనాక్షిపుర సమీపంలోని ఓ ప్రైవేటు ఫాం హౌస్‌లో ఆదివారం రేవ్ ‌పార్టీ జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది.  పక్కా సమాచారం కావడంతో పోలీసులు వెంటనే స్పందించి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ మత్తులో అమ్మాయిలు, అబ్బాయిలు తూగుతున్నారు. ఫామ్‌హౌస్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పార్టీలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌సీఎల్) బృందం పార్టీలో డ్రగ్స్ వినియోగంపై తనిఖీలు చేపట్టింది.

Also Read: DSC Results 2024: దసరా పండుగలోపు నిరుద్యోగులకు శుభవార్త: రేవంత్‌ రెడ్డి

 

50 మందిని అదుపులోకి తీసుకుని వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. దాడి సందర్భంగా 15 మందికిపైగా యువతులు అపస్మారక స్థితిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పార్టీలో డ్రగ్స్‌ వినియోగించినట్లు గుర్తించారు. దీంతో నిర్వాహకులతోపాటు డ్రగ్స్‌ వినియోగించిన వారిపై పోలీస్‌ శాఖ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. కాగా రాష్ట్రంలో వరుసగా రేవ్‌ పార్టీ సంఘటనలు జరుగుతుండడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. 'రేవ్‌ పార్టీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పోలీసులు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటారు' అని సీఎం తెలిపారు.

'పార్టీలో డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించినట్టు పోలీసులు ఉన్నతాధికారులు నివేదించారు. పార్టీలో పెద్ద ఎత్తున మద్యం, సిగరెట్లు ఉపయోగించారని, పార్టీకి హాజరైన వారి నుంచి శాంపిళ్లు సేకరించామని, రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నాం' అని పోలీసు ఉన్నత అధికారులు తెలిపారు. ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో తెలుగు సినీ ప్రముఖులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కర్ణాటకతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News