మిస్ వరల్డ్‌కి డ్యాన్స్ నేర్పింది.. ఆంధ్రా గురువులే..!

కూచిపూడిలో పూర్తిస్థాయి శిక్షణ తీసుకున్న మనుషి ప్రముఖ ఆంధ్రా నాట్యగురువులైన రాజా రాధారెడ్డి, కౌసల్యరెడ్డిలకు స్వయానా శిష్యురాలట.

Last Updated : Nov 26, 2017, 12:17 PM IST
మిస్ వరల్డ్‌కి డ్యాన్స్ నేర్పింది.. ఆంధ్రా గురువులే..!

దాదాపు 17 ఏళ్ళ తర్వాత భారత్ మళ్ళీ ప్రపంచ సుందరి టైటిల్‌ను కైవసం చేసుకుంది. చైనాలోని సాన్యా సిటీలో జరిగిన 2017 ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీల్లో 20 ఏళ్ళ మనుషి చిల్లర్ టైటిల్ గెలుచుకొని యావత్ దేశాన్ని ఆనందంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. 2000లో ప్రియాంక చోప్రా టైటిల్ గెలుచుకున్నాక.. మళ్లీ అదే గుర్తింపు పొందిన అందాలరాశిగా మనుషి వార్తల్లోకెక్కింది.

 

ఇటీవలే "రామ్ లీలా" చిత్రంలో దీపికా పడుకొనే నటించిన "రగడా" పాటకు మనుషి చేసిన డ్యాన్స్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా.. లెక్కలేనన్ని లైకులను, వీక్షకులను ఆ వీడియో సొంతం చేసుకుంది. ఆ డ్యాన్స్‌ను ఆమె మిస్ వరల్డ్ వేదికపై ప్రదర్శించడం విశేషం. కూచిపూడిలో పూర్తిస్థాయి శిక్షణ తీసుకున్న మనుషి ప్రముఖ ఆంధ్రా నాట్యగురువులైన రాజా రాధారెడ్డి, కౌసల్యరెడ్డిలకు స్వయానా శిష్యురాలట. నవంబరు 18, 2017 తేదీన మనుషి ప్రపంచ సుందరి టైటిల్ గెలుచుకుంది. 

 

Trending News