Amarnath Cloudburst Updates: అమర్‌నాథ్‌లో కుంభవృష్టి.. 13 మందికి పెరిగిన మృతుల సంఖ్య..

Amarnath Cloudburst Updates: అమర్‌నాథ్‌లో ఉన్నట్టుండి భారీ కుంభవృష్టి వర్షం కురిసింది. కుంభవృష్టి కారణంగా కొండపై ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు బురద ఏరులైపారింది. యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 13కి చేరగా.. 48 మంది గాయపడినట్టు సమాచారం అందుతోంది. 

Written by - Pavan | Last Updated : Jul 9, 2022, 12:26 AM IST
  • అమర్‌నాథ్‌లో ఉన్నట్టుండి భారీ కుంభవృష్టి
  • ఊహించని పరిణామానికి పరుగులు తీసిన జనం
  • ఎగువ ప్రాంతాల నుంచి ఏరులై పారిన బురద నీరు
Amarnath Cloudburst Updates: అమర్‌నాథ్‌లో కుంభవృష్టి.. 13 మందికి పెరిగిన మృతుల సంఖ్య..

Amarnath Cloudburst Updates: అమర్‌నాథ్‌లో ఉన్నట్టుండి భారీ కుంభవృష్టి వర్షం కురిసింది. అమర్‌నాథ్‌లో మంచు లింగం దర్శనం కోసం వెళ్తున్న యాత్రికులకు ఊహించని ఇబ్బంది ఎదురైంది. గుహకు సమీపంలో వరుణుడు కుండపోత వర్షం కురిపించాడు. దీంతో కొండపై ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు బురద ఏరులై పారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ కుంభవృష్టి వర్షం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13కి చేరింది. 48 మంది గాయపడ్డారు.

కుంభవృష్టితో అమర్‌నాథ్ గుహ పరిసరాలు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఊహించని పరిణామంతో అమర్‌నాథ్ యాత్రకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. 

అమర్‌నాథ్‌లో కుంభవృష్టి అనంతరం రంగంలోకి దిగిన నేషనల్ డిజాష్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్) బృందాలు కుంభవృష్టి వర్షం బారి నుంచి యాత్రికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసింది.

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం త్వరలోనే అప్‌డేట్ చేస్తాం.

Also read : AP, Telangana Weather IMD Live Updates: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్

Also read : YSR Jayanthi 2022: వైఎస్ఆర్ జయంతి.. వైఎస్ఆర్‌కి ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్ ? వైయస్ఆర్ డెత్ మిస్టరీ ఏంటి ?

Also Read : YS Vijayamma: విజయమ్మ తప్పుకుందా.. తప్పించారా! ఇడుపాలపాయలో రాత్రి ఏం జరిగింది..?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News