Rafale: మరి కొన్ని గంటల్లో భారత్ కు రాఫెల్, అంబాలాలో ఆంక్షలు

భారత అమ్ములపొదిలో అధునాత రాఫెల్ విమానాలు చేరడానికి మరికొన్ని గంటల వ్యవధి మిగిలింది. ఈ నేపధ్యంలో రాఫెల్ విమానాల ల్యాండ్ కానున్న అంబాలాలో భారీగా ఆంక్షలు విధించారు.

Last Updated : Jul 28, 2020, 06:56 PM IST
Rafale: మరి కొన్ని గంటల్లో భారత్ కు రాఫెల్, అంబాలాలో ఆంక్షలు

భారత అమ్ములపొదిలో అధునాత రాఫెల్ విమానాలు ( Rafale Aircrafts ) చేరడానికి మరికొన్ని గంటల వ్యవధి మిగిలింది. ఈ నేపధ్యంలో రాఫెల్ విమానాల ల్యాండ్ కానున్న అంబాలాలో భారీగా ఆంక్షలు ( Restrictions in Ambala ) విధించారు.

ఫ్రాన్స్ నుంచి భారతదేశం కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధవిమానాలు మరి కొన్ని గంటల వ్యవధిలో ఇండియాకు చేరుకోనున్నాయి. తొలి విడతలో భాగంగా ఐదు రాఫెల్ యుద్ధవిమానాలు ఫ్రాన్స్ నుంచి బయలుదేరాయి. మార్గమధ్యంలో ఎయిర్ ఫ్యూయల్  చేయించుకున్నాయి. దాదాపు 7 వేల 364 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం రేపు హర్యానాలోని అంబాలాకు చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా అంబాలాలో ( Ambala ) భారీ ఆంక్షలు విధించారు.

బుధవారం నాడు అంబాలాకు చేరుకోనున్న నేపధ్యంలో అక్కడ నో ఫ్లై జోన్ ( No Fly Zone ) ప్రకటించారు. అంతేకాకుండా చుట్టుపక్కల 4 గ్రామాల్లో  సెక్షన్ 144 విధించారు. జనం గుమిగూడకుండా...ఇళ్ల మిద్దెలపైకెక్కి ఫోటోలు తీయడం, వీడియో తీయడాన్ని సైతం పూర్తిగా నిషేధించారు. Also read: Rafale Aircrafts: త్వరలో భారత్ చేరుకోనున్న ఐదు రాఫెల్ విమానాలు

భారత వాయుసేనను ( Indian Airforce ) బలోపేతం చేసేందుకు మొత్తం 59 కోట్లతో 36 ఎయిర్ క్రాఫ్ట్ ను అందించేలా ఫ్రాన్స్ తో భారతదేశం ఒప్పందం చేసుకుంది. రాఫెల్ యుద్ధవిమానాల రాకతో భారతదేశ వాయుసేన మరింత శక్తివంతం కావడం ఖాయం. Also read: CAA: ఇంకెన్నాళ్లిలా ? పౌరసత్వం ఇవ్వండి దయచేసి

Trending News