ఏటీఎంలో కార్డు లేకుండానే క్యాష్ విత్‌డ్రా : ఎయిర్‌టెల్

ఏటీఎంలో కార్డు లేకుండానే క్యాష్ విత్‌డ్రా.. వారికి మాత్రమే!

Last Updated : Sep 7, 2018, 05:57 PM IST
ఏటీఎంలో కార్డు లేకుండానే క్యాష్ విత్‌డ్రా : ఎయిర్‌టెల్

ఇకపై ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు ఏటీఎం కార్డ్‌ లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఎయిర్‌టెల్. ఇన్‌స్టాంట్ మనీ ట్రాన్స్‌ఫర్ (ఐఎంటీ) పరిజ్ఞానంతో నడిచే పైగా పలు ఎంపిక చేసిన ఏటీఎమ్‌ కేంద్రాల్లో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా ఎయిర్ టెల్ స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా 20,000కు పైగా ఏటీఎం కేంద్రాల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఈ కార్డు రహిత సేవలు అందుబాటులో ఉంటాయని, ఈ ఏడాది చివరినాటికి ఐఎమ్‌టీ పరిజ్ఞానంతో పనిచేసే ఏటీఎమ్‌ల సంఖ్య లక్ష వరకు పెరుగుతుందని ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆరంభ ఆఫర్‌గా మొదటి రెండు విత్‌డ్రాయల్స్‌కు రూ.25 లావాదేవీల చార్జీలను రద్దు చేస్తున్నట్టు సంస్థ తమ ప్రకటనలో స్పష్టంచేసింది. 

తమ ఖాతాదారులకు ఈ కార్డు రహిత సేవలు అందించడం కోసం ఏటీఎంలకు ఐటీఎం సేవలు అందిస్తున్న ఎంపేస్ పేమెంట్స్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ వంటి పలు బడా బ్యాంకులు తమ వినియోగదారుల కోసం ఇదే తరహాలో కార్డురహిత సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

Trending News