Govt Jobs: రాత పరీక్ష కూడా లేకుండా గవర్నమెంట్ జాబ్.. నమోదు చేసుకునేందుకు ఈరోజే ఆఖరు!

Government Jobs 2023: యిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక గోల్డెన్ ఛాన్స్, అయితే ఆ ఉద్యోగాలకు అప్ప్లై చేసుకోవడానికి ఈరోజే ఆఖరు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 21, 2023, 06:57 PM IST
Govt Jobs: రాత పరీక్ష కూడా లేకుండా గవర్నమెంట్ జాబ్.. నమోదు చేసుకునేందుకు ఈరోజే ఆఖరు!

Government Jobs 2023: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక గోల్డెన్ ఛాన్స్, అయితే ఆ ఉద్యోగాలకు అప్ప్లై చేసుకోవడానికి ఈరోజే ఆఖరి ఛాన్స్. ఆసక్తికల, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.aai.aero ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 596 పోస్టులకు  నియామకం జరగనుంది.

అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ. అయితే అన్ని అర్హత పరీక్షలు పూర్తి చేసుకుని చివరిగా ఎంపికైన అభ్యర్థులకు 40,000 నుంచి 1,40,000 వరకు పే స్కేల్ ఉంటుంది. ఇక విశేషమేమిటంటే ఈ రిక్రూట్‌మెంట్‌లకు ఎలాంటి పరీక్షకు కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు.

కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు, ఇక ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మొత్తం 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుండగా వీటిలో అత్యధికంగా 440 పోస్టులు ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించినవే. ఇక ఆ డిపార్ట్మెంట్ తర్వాత సివిల్ 62, ఎలక్ట్రికల్ 84, ఆర్కిటెక్చర్ 10 పోస్టులున్నాయి. ఇక ఈ దరఖాస్తు కోసం, అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి వయస్సు 27 ఏళ్లు మించకూడదు, వారి వయస్సు జనవరి 21, 2023 నుండి లెక్కించబడుతుంది. అయితే, రిజర్వ్‌డ్ కేటగిరీకి గరిష్ట వయోపరిమితిలో కొంత సడలింపు లభిస్తుంది.

గేట్ 2020, 2021 మరియు 2022లో మంచి స్కోర్ సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో జాయిన్ కావాల్సి ఉంటుంది. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు, ఆ తర్వాత వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వారిని పిలుస్తారు. ఇక దరఖాస్తు ఫీజు రూ.1000 రూపాయలు కాగా ఆన్లైన్ దరఖాస్తుకు నేడే చివరి తేదీ.

Also Read: Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి

Also Read: Wipro Lays Off: విప్రో ఉద్యోగులకు ఝలక్.. 400 మందికి ఉద్వాసన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News