DGCA Fined Air India: మహిళపై మూత్రం పోసిన ఘటన.. ఎయిర్‌ ఇండియాకు భారీ ఫైన్

Air India Peeing Incident: ఎయిర్‌ ఇండియాపై డీజీసీఎ సీరియస్ యాక్షన్ తీసుకుంది. విమానంలో ఓ మహిళపై శంకర్ మిశ్రా అనే మూత్రం పోసిన ఘటనలో విచారణ జరిపింది. భారీ ఫైన్‌తోపాటు విమాన పైలట్ ఇన్ కమాండ్ లైసెన్స్‌ను 3 నెలలు రద్దు చేసింది. పూర్తి వివరాలు ఇలా.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2023, 03:43 PM IST
DGCA Fined Air India: మహిళపై మూత్రం పోసిన ఘటన.. ఎయిర్‌ ఇండియాకు భారీ ఫైన్

Air India Peeing Incident: విమానంలో మహిళపై మూత్ర విసర్జన ఘనటపై డీజీసీఎ కఠిన చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియా కంపెనీకి రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు.. విధి నిర్వహణలో విఫలమైనందుకు విమాన పైలట్ ఇన్ కమాండ్ లైసెన్స్‌ను 3 నెలల పాటు సస్పెండ్ చేసింది. నిందితుడు శంకర్ మిశ్రాపై నాలుగు నెలల పాటు నిషేధం విధిస్తూ ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై డీజీసీఏ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. అదేవిధంగా ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఇన్ ఫ్లైట్ సర్వీసులపై కూడా రూ.3 లక్షల ఫైన్ వేసింది.

ఏం జరిగిందంటే..?

గతేడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో మద్యం మత్తులో ఉన్న శంకర్ మిశ్రా అనే వ్యక్తి.. రాత్రి సమయంలో తాగి వచ్చి 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఆమె దుస్తులు, బూట్లు, హ్యాండ్ బ్యాగ్ మొత్తం మూత్రంతో తడిసిపోయాయి. అప్పుడు ఎయిర్ ఇండియా సిబ్బందికి మహిళ ఫిర్యాదు చేస్తే.. వాళ్లు ఆమెకు పైజామా, స్లిప్పర్స్ ఇచ్చి పంపించారు. మహిళను మళ్లీ అదే సీట్లో కూర్చొబెట్టారు. మూత్రం వాసన వస్తుందని బాధితురాలు చెప్పినా.. ఆమెను వాళ్లు అదే సీట్లు కూర్చొబెట్టారు. మూత్రం పోసిన వ్యక్తిపై  మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాధిత మహిళ సంస్థ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌కు లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ తరువాత ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని బెంగుళూరులో అరెస్ట్ చేశారు. అక్కడి ఢిల్లీకి తీసుకువచ్చి.. కోర్టులో హాజరుపరిచారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన డీజీసీఏ.. ఈ విషయంలో నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ ఎయిర్ ఇండియా ఇన్-ఫ్లైట్ సర్వీస్ డైరెక్టర్, ఆ విమానంలోని పైలట్లు, క్యాబిన్ సిబ్బంది అందరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
 
ఆరోపణలకు సంబంధించి ఎయిర్ ఇండియా విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. శంకర్ మిశ్రా ఎయిర్‌లైన్స్‌లో నాలుగు నెలల పాటు ప్రయాణించకుండా నిషేధించింది. అదే సమయంలో కమిటీ నిర్ణయం తప్పని నిందితుల తరపు న్యాయవాది అంటున్నారు. అంతకుముందే శంకర్ మిశ్రాపై తీవ్రమైన ఆరోపణల రావడంతో అతను పనిచేస్తున్న కంపెనీ వోల్ఫ్ ఫార్గో ఉద్యోగం నుంచి తొలగించింది. తమ ఉద్యోగుల నుంచి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా మంచి ప్రవర్తనను ఆశిస్తుందని తెలిపింది. ఈ మొత్త వ్యవహారంపై విచారణ చేపట్టిన డీజీసీఏ తాజాగా కఠిన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: China Dam: సరిహద్దులో చైనా మాస్టర్ ప్లాన్.. సీక్రెట్‌గా ఆనకట్ట నిర్మాణం  

Also Read: Kadapa Road Accident: ఆగి ఉన్న లారీ ఢీకొన్న టెంపో.. ముగ్గురు మహిళలు మృతి, 8 మందికి తీవ్రగాయాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News