Abhinandan Varthaman: అభినందన్‌ వర్ధమాన్‌కు గ్రూప్‌ కెప్టెన్‌గా ప్రమోషన్​!

Abhinandan Varthaman: వింగ్​ కమాండర్​ అభినంధన్ వర్ధమాన్​కు పదన్నోతి కల్పించింది భారతీయ వైమానిక దళం. ఆయన్ను గ్రూప్​ కెప్టెన్​గా ప్రమోట్  చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2021, 10:41 AM IST
  • అభినందన్ వర్ధమాన్​కు ప్రమోషన్​
  • గ్రూప్​ కెప్టెన్​గా పదోన్నతి కల్పిస్తూ ఐఏఎఫ్ ఉత్తర్వులు
  • వింగ్ కమాండర్​గా ఆయన సేవలకు గుర్తింపు
Abhinandan Varthaman: అభినందన్‌ వర్ధమాన్‌కు గ్రూప్‌ కెప్టెన్‌గా ప్రమోషన్​!

Abhinandan Varthaman gets promoted:  పాకిస్థాన్​ సైన్యాన్ని ఎదిరించి.. అశేష జనభారతం అభిమానాన్ని సంపాదించుకున్న అభినందన్‌ వర్ధమాన్​కు పదోన్నతి లభించింది.

వింగ్​ కమాండర్​గా ఉన్న వర్దమాన్​ను (Wing Commander Abhinandan Varthaman) గ్రూప్​ కెప్టెన్​గా నియమిస్తూ ఇండియన్ ఎయిర్​ఫోర్స్​ (ఐఏఎఫ్​) ఉత్తర్వులు జారీ చేసింది. సైనిక దళంలో కల్నల్​తో సమానమైన ర్యాంకే.. ఐఏఎఫ్​లో గ్రూప్​ కెప్టెన్​.

2019లో అభినందన్​ను వీర్‌ చక్ర అవార్డుతో (Veer Chakra to Abhinandan Varthaman) సత్కరించింది భారత ప్రభుత్వం.

Also read: Covaxin emergency use : కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో గ్రీన్‌ సిగ్నల్

అభినందన్ వర్ధమాన్​ గురించి..

2019 ఫిబ్రవరి 26న బాలాకోట్​లో (Balakot Attacks) ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిన తర్వాత మరుసటి రోజు పాకిస్థాన్​ సైన్యం ప్రతికార దాడికి యత్నించింది. ఇందులో భాగంగా ఎఫ్‌-16 విమానాలతో భారత్​పై దాడి చేయాలని ప్రయత్నించింది. ఇది గమనించిన.. భారత వైమానిక కమాండర్‌ అభినందన్‌ మిగ్‌-21 విమానంతో (Mig-21 Aircrofts) దానిని వెంటాడి నేలకూల్చారు.

Also raad: Aadhaar Card: ఆధార్ చట్టం ఉల్లంఘిస్తే ఇక భారీ జరిమానా తప్పదు..ఎంతో తెలుసా

అయితే ఈ ప్రయత్నంలో అభినందన్​ వర్ధమాన్​ విమానం కూడా.. కూలిపోయింది. ఈ ఘటనలో అభినందన్ వర్ధమాన్ సురక్షితంగా తప్పించుకున్నప్పటికీ.. పాకిస్థాన్ భూభాగంలో చిక్కుకున్నారు. దీనితో ఆయన్ను పాకిస్థాన్ సైన్యం అదుపులోకి తీసుకుని చిత్ర హింసలు పెట్టింది. అనేక నాటకీయ పరిణామల నేపథ్యంలో 59 గంటల తర్వాత పాక్ ఆర్మీ అభినందన్‌ను అమృత్‌సర్‌కి సమీపంలోని వాఘా బార్డర్ వద్ద ఇండియన్ ఆర్మీకి అప్పగించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత అభినంధన్​కు అవసరమైన వైద్య పరీక్షలు చేసి.. కొన్ని రోజులు విశ్రాంతి ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి ఆయన తన విధుల్లోకి చేరారు. 

Also read: Bus Fall into Ravine: పండుగ రోజు విషాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 22 మంది మృతి

Also read: Nitin Gadkari: తాను పెద్ద పర్యావరణవేత్తనన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News