Agnipath Recruitment: ఎయిర్‌ఫోర్స్, ఆర్మీల్లో అగ్నిపథ్ నియామకాలు ఎప్పుడో తెలుసా

Agnipath Recruitment: భారత ప్రభుత్వ అగ్నిపథ్ పథకం ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా త్రివిధ దళాల్లో యువకుల నియామకం జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్‌లో రిక్రూట్‌మెంట్ ఎప్పుడుంటుందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 17, 2022, 06:42 PM IST
 Agnipath Recruitment: ఎయిర్‌ఫోర్స్, ఆర్మీల్లో అగ్నిపథ్ నియామకాలు ఎప్పుడో తెలుసా

Agnipath Recruitment: భారత ప్రభుత్వ అగ్నిపథ్ పథకం ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా త్రివిధ దళాల్లో యువకుల నియామకం జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్‌లో రిక్రూట్‌మెంట్ ఎప్పుడుంటుందో తెలుసుకుందాం..

భారత త్రివిధ దళాల్లో నియామకం కోసం కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన కొత్త అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమౌతోంది. నిరసనకారులు శుక్రవారం నాడు భారీగా చేపట్టిన ప్రదర్శనలు హింసాత్మకమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వివాదాస్పద పథకానికి వ్యతిరేకంగా అత్యధికంగా వ్యతిరేకత బీహార్‌లో వ్యక్తమైంది. రాష్ట్రంలోని పలు స్టేషన్లలో నిరసనలు జరిగాయి. కొన్ని రైళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ తరుణంలో ఎయిర్‌ఫోర్స్ ఛీఫ్ మార్షల్ వీఆర్ చౌధురి ఈ కొత్త పథకంపై కీలక ప్రకటన చేశారు. కొత్త పథకం ప్రకారం ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాలు ఎప్పుడు ప్రారంభమయ్యేది వెల్లడించారు.

అగ్నిపథ్ ఎయిర్‌ఫోర్స్ నియామకాలు ఎప్పుడంటే

ఎయిర్‌ఫోర్స్‌లో జూన్ 24వ తేదీ నుంచి నియామకాలు ప్రారంభం కానున్నాయని ఎయిర్ ఛీప్ మార్షల్ వీఆర్ చౌధురి వెల్లడించారు. భారత ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిందని..దీనికింద యువకులు ఆర్మ్డ్‌డ్ ఫోర్సుల్లో నియమితులు కావచ్చని చెప్పారు. ఈ పథకంలో చేరేందుకు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు వయసుండాలి. అగ్మిపథ్ తొలి రిక్రూట్‌మెంట్ కోసం మాత్రం గరిష్ట వయస్సు 23 ఏళ్లు చేసినందుకు ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. యువకులు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేస్తారని ఆశిస్తున్నానన్నారు. ఎయిర్‌ఫోర్స్ నియామకాలు జూన్ 24 నుంచి జరగనున్నాయి. 

అగ్నిపథ్‌పై ఆర్మీ ఛీప్ ఏమన్నారు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై ఆర్మీ ఛీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పందించారు. ఈ పథకంలో గరిష్ట వయస్సును 21 నుంచి 23 ఏళ్లకు పెంచడం వల్ల ఆర్మీలో చేరేందుకు ప్రయత్నిస్తూ..గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా చేరలేకపోయిన యువకులకు ప్రయోజనం కలుగుతుందని జనరల్ మనోజ్ పాండే తెలిపారు. ఆర్మీలో చేరేందుకు గరిష్ట వయస్సులో మినహాయింపు తరువాత త్వరలోనే ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. అగ్నివీర్ రూపంలో త్రివిధ దళాల్లో చేరి..ప్రయోజనం పొందమని ఆర్మీ ఛీప్ జనరల్ మనోజ్ పాండే పిలుపునిచ్చారు. 

అయితే గరిష్ట వయస్సును 21 నుంచి 23 ఏళ్లకు పెంచడం కేవలం 2022 అగ్మిపథ్ రిక్రూట్‌మెంట్ కోసం మాత్రమేనని ఆర్మీ ఛీప్ తెలిపారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా భారత త్రివిధ దళాల్లో ఎటువంటి నియామకాలు లేకపోవడంతో ఆర్మీ బలగాల్లో చేరాలని ఆశపడిన యువకులకు నిరాశే ఎదురైంది. అటువంటివారిని దృష్టిలో ఉంచుకుని రెండేళ్లు మినహాయింపు ఇచ్చామని ఆర్మీ ఛీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. రిక్రూట్‌మెంట్ ఎప్పుుడనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. 

Also read: Agnipath Scheme Details: అగ్మిపథ్‌పై ఎందుకీ ఆందోళన, కారణాలేంటి, అగ్నిపథ్ అంటే ఏంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News